ప్రేమ కోసం విద్యార్థిని.. పరువు కొసం​ ప్రియుడి తండ్రి | Love Failure Girl Suicide In Warangal | Sakshi
Sakshi News home page

ప్రేమ కోసం విద్యార్థిని.. పరువు కొసం​ ప్రియుడి తండ్రి

Published Thu, Jan 17 2019 11:30 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Love Failure Girl Suicide In Warangal - Sakshi

మృతురాలి బంధువులతో మాట్లాడుతున్న ఎస్సై నరహరి మృతురాలు సింధూజ(ఫైల్‌)

వెంకటాపురం(ఎం): సంక్రాంతి పండుగ వేళ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొని మృతిచెందడంతో మండల పరిధిలోని పాలంపేట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మండలంలోని పాలంపేటకు చెందిన బోడ సుమలత–సంజీవయ్య దంపతుల పెద్ద కూతురు సింధూజ(18) మండలంలోని జవహర్‌నగర్‌ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదారాబాద్‌లో ఉంటున్నారు. సంక్రాంతి సెలవులకు ఈనెల 10న సాయంత్రం సింధూజ పాలంపేటలోని తన పెద్దనాన్న రవి ఇంటికి వచ్చింది.

సింధూజ పాలంపేటకు చెందిన కొండబత్తుల రమేష్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తెలిసింది. ఈనెల 14న సింధూజ ఇంటివద్దే ఉదయం 10 గంటలకు పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు ము లుగు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొం దుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. తన కూతురు కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని సింధూజ తల్లి సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సింధూజ తల్లిదండ్రులు ఆమె ఫోన్‌ డాటాను పరిశీలించారు.

సింధూజ మృతికి ఇదే గ్రామానికి చెందిన కొండబత్తుల రమేష్‌ కారణమని 15న ఉదయం వెంకటాపురం పోలీసులకు ఆమె తల్లి దండ్రులు మరోసారి ఫిర్యాదు చేశారు. అలాగే రమేష్‌ ఇంటి ఎదుట మృతదేహంతో మంగళవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం  వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ క్రమంలో కొండబత్తుల రమేష్‌ తండ్రి రాజు సాయంత్రం  ఇంటివద్దే పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యల మృతి చెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement