సాక్షి, చిట్యాల: నెల రోజుల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టెం వరలక్ష్మి కరోనాతో నెల రోజుల క్రితం మృతి చెందింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు పట్టెం భవాని(17)శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన తండ్రి వీరస్వామి మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment