బాలిక ఆత్మహత్య | Girl Commits Suicide In Kurnool | Sakshi
Sakshi News home page

బాలిక ఆత్మహత్య

Published Thu, Jun 7 2018 12:20 PM | Last Updated on Thu, Jun 7 2018 12:20 PM

Girl Commits Suicide In Kurnool - Sakshi

మృతిచెందిన బాలిక

రుద్రవరం(ఆళ్లగడ్డ): రుద్రవరం మండలం లోని ఆలమూరు గ్రామంలో ఓ బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు వివరాలు.. రాజస్తాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఆలమూరుకు వలస వచ్చి మిఠాయిలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. దగ్గరి బంధువైన ఓ బాలిక వారితోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆ బాలికను ఓ ఆకతాయి నిత్యం ఫోన్‌లో, అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్లి వేధించేవాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందేమోనని భయపడిన బాలిక మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగి పడుకుంది.

బుధవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గమనించిన కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయంపై రుద్రవరం ఎస్‌ఐ పీరయ్యను సంప్రదించగా.. బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నది వాస్తవమేనని, కుటుంబ సభ్యులు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అయితే ఓయువకుడు వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోందని, బాలిక ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టామన్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement