
సాక్షి, ఎడపల్లి (బోధన్): చదువులో వెనుకబడిందని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బోర్గం శంకర్, అన్నపూర్ణ దంపతులు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కూతురు స్నేహలత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె కొంతకాలంగా ఫిట్స్ వ్యాధితో బాధ పడుతోంది. అయితే, ఆమె చదువులో వెనుకబడి ఉందని గమనించిన తల్లిదండ్రులు బాగా చదవమని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్నేహలత.. ఇంట్లోని బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
తాగొచ్చి వేధిస్తున్నాడని.. భర్తను నరికి చంపిన భార్య
కరీమాబాద్ : నిత్యం మద్యం తాగొచ్చి హింసిస్తున్న భర్తను భార్య దారుణంగా నరికి చంపింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం శంభునిపేట బుడిగజంగాల కాలనీలో గురువారం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ సీఐ నరే‹Ùకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న చిల్ల రాజ్‌కుమార్ (27), యాకలక్ష్మి దంపతులు. కూలి పనులు చేసే రాజ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడమే కాకుండా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో విసిగిపోయిన యాకలక్ష్మి గురువారం ఉదయం భర్త రాజ్‌కుమార్‌ను గొడ్డలితో నరికి చంపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.