edapalli
-
చదవాలని మందలిస్తే..
సాక్షి, ఎడపల్లి (బోధన్): చదువులో వెనుకబడిందని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బోర్గం శంకర్, అన్నపూర్ణ దంపతులు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కూతురు స్నేహలత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె కొంతకాలంగా ఫిట్స్ వ్యాధితో బాధ పడుతోంది. అయితే, ఆమె చదువులో వెనుకబడి ఉందని గమనించిన తల్లిదండ్రులు బాగా చదవమని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్నేహలత.. ఇంట్లోని బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. తాగొచ్చి వేధిస్తున్నాడని.. భర్తను నరికి చంపిన భార్య కరీమాబాద్ : నిత్యం మద్యం తాగొచ్చి హింసిస్తున్న భర్తను భార్య దారుణంగా నరికి చంపింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం శంభునిపేట బుడిగజంగాల కాలనీలో గురువారం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ సీఐ నరే‹Ùకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న చిల్ల రాజ్‌కుమార్ (27), యాకలక్ష్మి దంపతులు. కూలి పనులు చేసే రాజ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడమే కాకుండా హింసిస్తున్నాడు. ఈ క్రమంలో విసిగిపోయిన యాకలక్ష్మి గురువారం ఉదయం భర్త రాజ్‌కుమార్‌ను గొడ్డలితో నరికి చంపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి
శుభకార్యంలో పాల్గొనడానికి దర్గాకు వెళ్లిన ఆ ఐదుగురు.. ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చనిపోయిన వారందరూ జానకంపేట వాసులే.. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సాక్షి, ఎడపల్లి(నిజామాబాద్) : జానకంపేట సర్పంచ్ తన కూతురు కేశఖండనం కార్యక్రమాన్ని కుర్నాపల్లిలోని అబయ్యదర్గా వద్ద నిర్వహించారు. ఈ శుభకార్యంలో పాల్గొనడానికి గ్రామానికి చెందిన జక్కం బాలమణి(68), గంగామణి(60), కళ్లపురం సాయిలు(68), చిక్కల సాయిలు(60) ఆటోలో వెళ్లారు. భోజనంచేసి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అలీసాగర్ –జానకంపేట గ్రామాల మధ్యనున్న మూలమలుపు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. అ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బాలమణి, గంగామణి, కళ్లపురం సాయిలు, చిక్కల సాయిలుతోపాటు ఆటో డ్రైవర్ నయీం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నయీంను నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్ది సేపటికే ఐదుగురూ మృతి చెందారు. కారులోని వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం
-
జోరు వాన
ఇందూరు : నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లా మొత్తం సగటున 36.6 మిల్లి మీటర్ల వర్షపాతన నమోదైంది. నవీపేట్, ఎడపల్లి, భీమ్‌గల్ మండలాల్లో అత్యధికంగా ఏడు సెంటి మీటర్ల చొప్పున వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. లింగంపేట మండలంలో పెద్దవాగు, పాముల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 11 ఇళ్లు «ధ్వంసమయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం వెయ్యిక్యూసెక్కుల వరదనీటి ప్రవాహం వచ్చింది. ఎగువన ఉన్న మంజీర వాగు నీటితో నిండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17.8 టీఎంసీలకు గాను ప్రసుతం 1,367 మీటర్లతో 0.085 ఎమ్‌సీఎఫ్‌టీల నీరు ఉంది. మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామ శివారులోని లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోలెవల్ వంతెన పూర్తిగా నీట మునిగిపోవడంతో గ్రామానికి ఉదయం నుంచి రాత్రి వరకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ ఒక్క గేటు ఎత్తి దిగువకు విడుదల చేపడుతున్నారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతొ ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 458 మీటర్లతో నిండి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని నాందేyŠ జిల్లాలో భారీ వర్షాలకు విష్ణుపురి జలాశయం నిండిపోగా నాలుగు గెట్లును తెరచి దిగువ తెలంగాణకు సరిహద్దులో ఉన్న బాబ్లి ప్రాజెక్టుకు నీరును వదులు తున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది.