![POCSO Victim Girl Ends Her Life At Mahabubnagar District - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/26/Mahabubnagar-District.jpg.webp?itok=6AtBKtyO)
నిందితుడు మహేశ్
సాక్షి, జడ్చర్ల: ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఓ ప్రైవేట్ టీచర్ ఉచ్చులో చిక్కుకున్న బాలిక కథ విషాదాంతమైంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపిన పోక్సో కేసులో బాధితురాలు (15ఏళ్ల బాలిక) బుధవారం జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మమ్మీ, డాడీ సారీ.. తప్పు నాదే’ అని బాలిక రాసిన సూసైడ్ నోట్ గదిలో దొరికింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసి మానేసిన రాజాపూర్‌కు చెందిన దేవరకాడి మహేశ్(35) ఆన్‌లైన్ క్లాసుల పేరుతో బాధితురాలిని వలలో వేసుకుని పలుసార్లు తన కామవాంఛ తీర్చుకున్నాడు.
చదవండి: Drugs Case: నాలుగేళ్ల కిందటి డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు
ఈ నేపథ్యంలోనే ఈ నెల 4న కారులో బాలికను హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఈలోగా పోలీసు కేసు, విచారణ గురించి తెలుసుకున్న నిందితుడు బాలికను 10న రాజాపూర్ బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లాడు. నిందితుడు మహేశ్, అతడికి సహకరించిన అతని మిత్రుడిని 13న పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి బుధవారం పోలీసులు బాలికకు సమన్లు జారీ చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి సమన్లు ఇవ్వడంతో బాలిక మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment