కేఎంసీలో ఎంబీబీఎస్‌ నూతన అడ్మిషన్లు | New admissions in MBBS in KMC | Sakshi
Sakshi News home page

కేఎంసీలో ఎంబీబీఎస్‌ నూతన అడ్మిషన్లు

Published Sat, Sep 24 2016 1:10 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

New admissions in MBBS in KMC

ఎంజీఎం : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ)లో వెబ్‌ కౌన్సిల్‌ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించిన వెబ్‌ కౌన్సిలింగ్‌లో హాజరైన విద్యార్థులకు ర్యాంకులు, వెబ్‌ ఆప్షన్ల ప్రకారం ఆయా కళాశాలల్లో సీట్లు కేటాయించారు. ఇందులో భాగంగా కేఎంసీ కళాశాలకు 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కేటాయించినట్లు ప్రిన్సిపాల్‌ విద్యాసాగర్‌ తెలిపారు. శుక్రవారం 38 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు ఆయన వివరించారు. మిగతా విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా కళాశాలలో అడ్మిషన్‌ పొందాలని..లేకుంటే 26న కళాశాలలో ఖాళీగా ఉన్న స్థానాలను యూనివర్సిటీకి తెలియజేయడం జరుగుతుందన్నారు. చివరి రోజు ఆదివారం బ్యాంకుకు సెలవుదినం కావడంతో విద్యార్థులు కళాశాలలకు సమర్పించే చాలన్లను కళాశాలలో అందుబాటులో ఉంచామని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement