
అయోధ్య: కాలేజీలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్ షీట్‌ను సమర్పించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీకి(బీజేపీ) ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఆయనకు రూ.8 వేల జరిమానా విధించింది. తివారీని పోలీసులు జైలుకు తరలించారు. ఆయనపై 1992లో అయోధ్యలో సాకేత్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. గ్రాడ్యుయేషన్ సెకండియర్‌లో ఫెయిలైన తివారీ 1990లో నకిలీ మార్క్ షీట్ సమర్పించి, పై తరగతిలో చేరినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.