marksheet
-
మరోసారి వార్తల్లో నిలిచిన సివిల్స్ టాపర్ టీనా దాబీ.. మార్క్‌షీట్ వైరల్
యూపీఎస్సీ టాపర్, ఐఏఎస్ అధికారి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సీబీఎస్ఈ 12వ తరగతి మార్క్‌షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీనాకు హిస్టరీ, పాలిటికల్ సైన్స్‌లో 100కు 100 మార్కులు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. అయితే ఈ మార్క్‌షీట్ నిజంగా టీనాదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమెకు రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు రావడాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అసలు టీనా మార్క్‌షీట్ నెట్టింట్లో లేదని తెలుస్తోంది. అయితే టీనా 2011 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 93శాతం మార్కులు సాధించినట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో చదివిన ఆమె.. టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేసింది. తన ప్రతిభకు గానూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా అందుకుంది. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోంది. తరచూ వార్తల్లో టీనా సివిల్స్‌లో టాపర్ అయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన దళిత యువతిగా అరుదైన ఘనత సాధించింది. అయితే సివిల్స్ రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా వెనక్కి తగ్గకుండా 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ప్రదీప్ గవాండేను(2013 ఐఏఎస్ బ్యాచ్)ను రెండో వివాహం చేసుకుంది టీనా. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి 2022లో జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం. చదవండి: జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
అయోధ్య: కాలేజీలో అడ్మిషన్ కోసం నకిలీ మార్క్ షీట్‌ను సమర్పించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీకి(బీజేపీ) ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఆయనకు రూ.8 వేల జరిమానా విధించింది. తివారీని పోలీసులు జైలుకు తరలించారు. ఆయనపై 1992లో అయోధ్యలో సాకేత్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. గ్రాడ్యుయేషన్ సెకండియర్‌లో ఫెయిలైన తివారీ 1990లో నకిలీ మార్క్ షీట్ సమర్పించి, పై తరగతిలో చేరినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
నకిలీ 'ఎంటెక్'తో ఉద్యోగం.. తెలుగు యువకుడిపై కేసు
కాన్పూర్: ఎంటెక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ గేట్లో మెరిట్ ర్యాంకు వచ్చిందని నమ్మబలికి ఓఎన్జీసీలో ఉద్యోగం కొట్టేయడానికి ప్రయత్నించిన ఓ తెలుగు యువకుడిపై డెహ్రాడూన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గేట్- 2015 కన్వీనర్, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ షౌనక్ ఛటర్జీ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుణతేజ సుదర్శన్ కొద్దిరోజుల కిందట డ్రెహ్రాడూన్లోని ఓఎన్జీసీలో ఇంజనీర్ ఉద్యోగానికిగానూ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. గేట్ ఎగ్జామ్‌లో 712 స్కోరుతో ఆలిండియా 206వ ర్యాంకు పొందానని, కెమికల్ ఇంజనీరింగ్‌లో టాప్ మార్కు తనదేనని నమ్మబలికాడు. అతని తీరును శంకించిన ఇంటర్వ్యూ అధికారులు.. సుదర్శన్ ఇచ్చిన గేట్ మార్కుల లిస్టుపై తమకు అనుమానం ఉదని, ఓ సారి పరిశీలించి చూడమని గత సోమవారం గేట్- 2015 కన్వీనర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గేట్ ఎంట్రెన్స్‌లో సుదర్శన్ అసలు పాస్ కానేలేదు! 100కు అతనికి వచ్చింది కేవలం 17.67 మార్కులే! ఓఎన్జీసీ అధికారుల ఫిర్యాదుతో సీన్లోకి ఎంటరైన డెహ్రాడూన్ పోలీసులు సుదర్శన్ దాఖలు చేసిన నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.