
భీమవరం(పశ్చిమ గోదావరి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ‘అమ్మఒడి’ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. భీమవరం పట్టణం నాచువారి సెంటర్‌లోని పొట్టిశ్రీరాములు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు భారీ స్థాయిలో జరిగాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. మంగళవారం పాఠశాలను సందర్శించిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్‌వీ రమణ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తరగతి గదుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య ప్రకారం పాఠశాలలో 750 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లకు అవకాశం ఉందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 850 మించిపోవడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటుచేశారు. నూతనంగా భవన నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం ఉందని హెచ్‌ఎం చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం కేవీవీ భోగేశ్వరరావు, ఉపాధ్యాయులు వీఎం రాధాకృష్ణ, జె సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment