జూన్‌.. జేబు గుల్ల | This Educationa Year Starts In June Private Schools Demanding Fees | Sakshi
Sakshi News home page

జూన్‌.. జేబు గుల్ల

Published Thu, May 24 2018 8:56 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

This Educationa Year Starts In June Private Schools Demanding Fees - Sakshi

సరస్వతీ నిలయాలుగా విరాజిల్లే విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ఫలితంగా సగటు జీవి తన పిల్లల్ని ప్రైవేటుపాఠశాలల్లో చదివించాలంటే పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను బాగా చదివించి, వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలని ప్రైవేటు విద్య భారమై, నానా తంటాలు పడుతున్నారు. తల్లిదండ్రుల ఆసక్తిని గుర్తించిన ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఏటా ఫీజుల ఇష్టానుసారంగా పెంచేసి, దండుకుంటున్నాయి.  దీంతో జూన్‌ వస్తుందంటే తల్లిదండ్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

చిత్తూరుఎడ్యుకేషన్‌: నూతన విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభం కానుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటే అడ్మిషన్‌ ఫీజు మొదలుకుని యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు, బస్సు ఫీజు ఇలా మూకుమ్మడి ఖర్చుల మోత మోగనుంది. ఏటా ప్రైవేట్, కార్పొరేట్‌ ఫీ జులుం ఎక్కువవుతుండంతో తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సకలం ఉచితంగా ఇస్తున్నా, అత్యన్నత అర్హతలు కలిగిన టీచర్లున్నా, నాణ్యమైన బోధన లభించదనే పుకార్లు ఉండడంతో తల్లిదండ్రులు ఆవైపు కన్నెత్తి చూడడం లేదు. ఖర్చు భారమైనా ప్రైవేటు విద్యకే మొగ్గు చూపుతున్నారు.

ప్రభుత్వ బడుల్లో అన్ని ఉచితమైనా...
ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ అమ్మో జూన్‌ అనుకునేవారు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తమ పిల్లలను చేర్చాలనుకోవడం లేదు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో రూ.లక్షల ఫీజులు చెల్లించకుండానే విద్యను బోధిస్తారు. యూని ఫామ్‌ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. పుస్తకాల నుంచి మధ్యాహ్న భోజనం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే అందజేస్తుంది. అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధ న చేస్తారు. అయినా తల్లిదండ్రులు మా త్రం తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిం చేందుకు ససేమిరా అంటున్నారు. కారణం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించరనే భావన ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. 

ఫీజుల మోత
విద్యార్థుల తల్లిదండ్రులు భయపడటానికి పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు మోతేæ ప్రధానంగా కనిపిస్తోంది. ఫీజుల గురించి మాట్లాడాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నా రు. జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో నర్సరీకి, ఎల్‌కేజీ, యూకేజీలో చేర్చాలంటే రూ.10 నుంచి రూ.25 వేల వరకు చెల్లించాల్సి ఉం టుంది. ఒకటి నుంచి మూడో తరగతి వరకు రూ. 25 వేల నుంచి రూ.30 వేలు, నాలుగు నుంచి ఏడో తరగతి వరకు రూ. 35 వేల నుం చి రూ.45 వేల వరకు ఫీజు ఉంది. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు రూ.55 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక కళాశాలల విషయానికొస్తే పలు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి రూ.1.50 లక్షలు వరకు వసూలు చేస్తున్నారు.

అడ్మిషన్లు అయిపోతాయ్‌ రా రమ్మని పిలుపు!
మే నెల ప్రారంభం నుంచే పాఠశాలలు, కళా శాలల్లో అడ్మిషన్లు, పుస్తకాలు అయి పోతాయ్‌ రండం టూ యాజామాన్యాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు మొదలయ్యా యి. దీంతో పేదలు, మధ్య తరగతి కుటుం బాల వారు బెంబేలెత్తిపోతున్నారు. పిల్లల చదువుల కోసం ఎంత పెట్టుబడి పెట్టాలో లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నాణ్యమైన విద్యనుఅందించరన్నది అవాస్తవం
ప్రభుత్వ బడులలో నాణ్య మైన విద్యను అం దించరనే పుకార్లు అవాస్తవం. నిష్ణాతులైన, అపార అనుభవం కలిగిన టీచర్లు ప్రభుత్వ బడులలో పనిచేస్తున్నారు. ఇటీవల పది ఫలి తాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభు త్వ బడులు వందల్లో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో టై, టక్కును చూసి తల్లిదండ్రులు మోసపోకండి. ప్రభుత్వ బడులలో పిల్లను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు సహకరించండి.    
– పాండురంగస్వామి, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement