చిత్తూరు(సిటీ) : రాష్ట్రంలోని బీసీలందరూ ఐక్యంగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరులో టీటీడీ కల్యాణ మండపంలో మొదలియార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుల్లెట్ సురేష్ అధ్యక్షతన మొదలియార్ల సంక్షేమ సంఘం, ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న 400 మందికి పైగా బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో దాదాపు 50 శాతం వరకు బీసీలు ఉన్నారని, అయితే వారి అభ్యున్నతి అంతంత మాత్రం గానే ఉండటం బాధాకరమని చెప్పారు. విద్య, ఉద్యో గ, ఉపాధి అంశాల్లో అమలుచేస్తున్న రిజర్వేషన్లు బీసీలకు జనాభా ప్రాతిపదికన పెంచాలని డిమాండ్ చేశా రు.విద్యార్థుల ఉపకారవేతనాల మంజూరులో జాప్యం జరగకుండా చూసుకుంటానన్నారు.
బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ జిల్లాలోని మొదలియార్లకే కాకుండా బీసీల్లోని ఉపకులాల్లో నిరుపేద విద్యార్థులకు సైతం తన తండ్రి బుల్లెట్ శ్రీనివాసులు చారిటబుల్ ట్రస్ట్‌చే ప్రతి ఏటా ఉపకారవేతనాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. బీసీలందరూ ఐక్యంగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. పోరాటాలతోనే ఇది సాధ్యమని, ఈ విషయంలో తన సహకారం తప్పక ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఎమ్మేల్యే డీఏ సత్యప్రభ ప్రసంగించారు. హైదరాబాదు నుంచి చిత్తూరుకు చేరుకున్న కృష్ణయ్యకు బుల్లెట్ సురేష్‌తో పాటు సంఘం జిల్లా అధ్యక్షుడు దశరథాచారి, సంఘం ప్రతినిధి మధుసూదన్, ఇతర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మురకంబట్టు సర్కిల్ నుంచి కయనికట్టు వీధిలో ఉన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పీసీఆర్ సర్కిల్‌లోని మహాత్మాపూలే విగ్రహానికి కృష్ణయ్య పూలమాలవేసి నివాళులర్పించారు.
బీసీలందరూ ఐక్యంగా ఉండాలి
Published Fri, Oct 3 2014 3:07 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement