సాక్షి, విజయవాడ: ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్‌లైన్ అడ్మిషన్లపై మార్చి నెలలోనే సర్క్యులర్ ఇచ్చామని పేర్కొన్నారు. సీట్ల కొరత ఉందని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇంటర్‌లో చేరడానికి ఎక్కడా సీట్ల కొరత లేదని తెలిపారు. కొత్తగా మంజూరైన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన)
పదవ తరగతి పాసైన ప్రతీ ఒక్కరికి సీటు లభిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అగ్నిమాపకశాఖ ఎన్‌ఓసి లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతులిచ్చామని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకి లోబడి ఇంటర్ అడ్మిషన్లు కొనసాగింపు, సీట్ల సంఖ్య ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: ప్రణయ్ ఆత్మహత్య.. సంచలన విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment