
హాల్ టికెట్‍లో నటి టాప్ లెస్ ఫొటో
ఓ విద్యార్థిని హాల్ టికెట్ ప్రస్తుతం ఇంటర్నెట్‍లో హల్ చల్ చేస్తోంది.
పాట్నా: ఓ విద్యార్థిని హాల్ టికెట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎగ్జామ్ హాల్ టికెట్ లో ఆ విద్యార్థిని ఫొటోకు బదులుగా టాప్ హీరోయిన్ టాప్ లెస్ ఫొటో రావడమే ఇందుకు ప్రధాన కారణం. హిందీ దినపత్రిక ప్రభాత్ కబర్లో ఈ కథనం రావడంతో విషయం వెలుగుచూసింది. దీంతో బిహార్ ఎగ్జామ్ బోర్డుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(బీఎస్ఎస్‍సీ) ఈ నెల 8న ఎస్ఎస్సీ ఇంటర్ లెవల్ పరీక్షల హాల్ టికెట్లను జారీ చేసింది. అయితే ఓ హాల్ టికెట్ చూసుకున్న ఓ విద్యార్థిని షాక్ కు గురైంది. ఆ హాల్ టికెట్లో తన ఫొటోకు బదులుగా మరోకరి ఫొటో వచ్చింది. అందులోనూ స్టార్ హీరోయిన్ టాప్ లెస్ ఆ ఫొటో దర్శనమివ్వడంతో విద్యార్థినికి ఏం చేయాలో తెలియక ఆందోళన చెందింది.
ఈ ఫొటోను ఓసారి పరిశీలించినట్లయితే.. బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(బీఎస్ఎస్‍సీ) హాల్ టికెట్ జారీ చేసింది. ఫస్ట్ ఇంటర్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2014 అని ఉంది. నలంద జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పేరుతో ఉన్న నటి టాప్ లెస్ ఫొటోను జనరల్ నాలెడ్జ్ పేపర్ అడ్మిట్ కార్డులో ప్రింట్ చేశారు. కాగా, విద్యార్థినికి ఆ పరీక్ష ఫిబ్రవరి 26న ఉంది. విద్యార్థిని హాల్ టికెట్ లో నటి టాప్ లెస్ ఫొటో వచ్చిందని తెలుసుకుని ఫొటో తీసి సోషలో మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో విద్యార్థిని అడ్మిట్ కార్డ్ వైరల్ గా మారింది. దీనిపై బీఎస్ఎస్సీ అధికారుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
గతేడాది బిహార్ టాపర్ల స్కామ్ దేశంలో హాట్ టాపిక్‍గా మారిన విషయం తెలిసిందే. ఇంటర్ టాపర్లు తాము ఏ సబ్జెక్టులు చదివారో, అందులో ఏయే విషయాలు ఉంటాయో చెప్పలేక తికమకపడి.. చివరికి దొరికిపోయారు. పొలిటికల్ సైన్స్ లో వంటల గురించి ఉంటుంది. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని టాపర్ ఓ టాపర్ రూబీరాయ్ చెప్పడం బిహార్ విద్యావ్యవస్థ నిర్లక్షధోరణిని తెలియజేస్తుంది. తాజాగా విద్యార్థుల హాల్ టికెట్లలో ఇతరుల ఫొటోలు రావడం, అది కూడా నటి టాప్ లెస్ ఫొటో కావడంతో బిహార్ ఎగ్జామ్ బోర్డులు నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది.