
బాలీవుడ్ తారలు ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్ ఇద్దరూ కేవలం ఓ పాటలో మాత్రమే కలిసి నటించారు. కానీ వీళ్లకు పెళ్లైందని, బిహార్‌కు మకాం మార్చారని, ఈ జోడీకి డిగ్రీ చదివే కొడుకున్నాడంటూ ఈ మధ్య ఓవార్త తెగ హల్‌చల్ అవుతోంది. ఇది కాస్తా సన్నీలియోన్ కంటపడగా ఆమె తేలికగా నవ్వేశారు. ఆ విద్యార్థి చేసిన తుంటరి పనికి ఏమీ అనలేక మెచ్చుకోలుగా చమత్కరించారు. అసలేం జరిగిందంటే.. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల కుందన్ కుమార్.. ధనరాజ్ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు తప్పుడు వివరాలతో హాల్ టికెట్‌కు దరఖాస్తు చేశాడు. తల్లి పేరు రాయాల్సిన కాలమ్‌లో సన్నీలియోన్ అని, తండ్రి అని ఉన్న దగ్గర ఇమ్రాన్ హష్మీ అన్న పేర్లను రాశాడు. (చదవండి: రాజకీయాల్లో రాణించాలి: చిరంజీవి)
తల్లిదండ్రుల పేర్లు బాలీవుడ్ సెలబ్రిటీలను సూచిస్తుండటంతో ఆ ఎక్జామ్ అప్లికేషన్ ఫామ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తుంటరి పని చేసిన సదరు విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే బాలీవుడ్ భామ సన్నీలియోన్ మాత్రం ఆ విద్యార్థి చేసిన పనికి సరదాగా నవ్వుకున్నారు. అతడిని అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. అతడు ఇలాగే ఎప్పుడూ పెద్ద పెద్ద కలలు కంటూ ఉండాలి అని చమత్కరించారు. అయితే ఇలా సన్నీలియోన్ పేరు వార్తల్లో నిలవడం ఇదేమీ కొత్త కాదు. గతంలో బిహార్ జూనియర్ పరీక్షలో సన్నీలియోన్ టాపర్‌గా నిలిచిందని, దీంతో ఆమె కోల్‌కతాలోని కళాశాలకు ఎంపికైందని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా ఆవిడ ఫన్నీగా స్పందిస్తూ మీ అందరినీ కాలేజీలో కలుస్తానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించే స్ప్లిట్స్ విల్లా తర్వాతి సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (చదవండి: తల్లి సన్నీ లియోన్.. తండ్రి ఇమ్రాన్ హష్మి)
This kids awsome !!!!! Way to dream big :)))))))) XO hahahaha https://t.co/VEkTnsv4VT
— sunnyleone (@SunnyLeone) December 12, 2020