నేటి నుంచి జూనియర్‌ కళాశాలల పునఃప్రారంభం | junior colleges starts from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జూనియర్‌ కళాశాలల పునఃప్రారంభం

Published Thu, Jun 1 2017 12:46 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

junior colleges starts from today

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను గురువారం నుంచి పునఃప్రారంభించననున్నట్లు ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఎండలు ఎక్కుగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే మధ్యాహ్నం వరకే కళాశాలలను నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని సూచించారు. కాగా, ఇప్పటికే ప్రైవేట్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇంటర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో అడ్మిషన్లపై ప్రిన్సిపాళ్లు అయోమయంలో ఉన్నారు. కాగా, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల మూల్యంకనం పూర్తయింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement