half day
-
Ayodhya: 22న బ్యాంక్యులు పనిచేసేది సగం రోజే!
ముంబై: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ) జనవరి 22న సగం రోజు మాత్రమే పనిచేస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత వ్యవహారాలు, శిక్షణా శాఖ కూడా ఒక కీలక ఉత్వర్వులు జారీచేస్తూ, జనవరి 22న కేంద్ర ప్రభుత్వ స్థాపనను సగం రోజు పనిదినాన్ని ప్రకటించింది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న మనీ మార్కెట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు (ప్రాధమిక– ద్వితీయ), విదేశీ మారకద్రవ్యం, ద్రవ్య మార్కెట్లు, రూపీ ఇంట్రస్ట్ డెరివేటివ్‌లలో ఎటువంటి లావాదేవీలు, సెటిల్మెంట్లు ఉండబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఇక రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకునే, డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కూడా 22వ తేదీ ఉండదని ఆర్బీఐ మరో సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ సౌలభ్యం తిరిగి జనవరి 23వ తేదీన ప్రారంభమవుతుంది. ‘‘భారత ప్రభుత్వం ప్రకటించిన సగం రోజు పని దినం కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనూ 2024 జనవరి 22, సోమవారం రూ. 2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు’’ అని సెంట్రల్ బ్యాంక్ ప్రకటన తెలిపింది. -
4 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఈనెల 4వ తేదీనుంచి ఒంటిపూట బడులుగా నడవనున్నాయి. వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సోమవారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు ఒంటిపూట బడు లు ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీనుంచి 13వ తేదీ వరకు టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి -
అంగన్వాడీలు ఒంటిపూటే
నల్లగొండ : అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేసవి కాలంలో పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు ఈ నెల 13 నుంచి వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఈవెసులుబాటు కల్పించారు. ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల కేంద్రాల్లో పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మహిళా, శిశు సంక్షేమశాఖ.. అంగన్వాడీ కేంద్రాలను ఈ నెల 13 నుంచి వచ్చే నెల 31 వరకు ఒక్కపూటమాత్రమే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 31 మండలాల్లో 2,093 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కేంద్రాలు 1,832, మినీ కేంద్రాలు 261 ఉన్నాయి. వీటిల్లో చాలాచోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో..అందులోనూ ఇరుకు గదుల్లో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్ల సౌకర్యం లేక అరకొర వసతులతో సర్దుకుపోతున్నారు. దీనికితోడు ఇరుకైన గదులు కావడంతో గాలి, వెలుతురు సరిగాలేక ఉక్కపోతతో చిన్నారులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను ఒక్కపూట నిర్వహించడంతో పిల్లలకు, సిబ్బందికి ఉపశమనం కలిగించినట్లు అవుతుంది. 12 గంటల వరకే కేంద్రాలు... ఇప్పటిదాకా పాఠశాలలు మాత్రమే ఒక్కపూట నిర్వహించారు. వాటికి అనుసంధానంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. దీంతో చిన్నారులకు ఇబ్బంది తప్పడం లేదు. అంగన్వాడీ టీచర్ల కోరిక మేరకు ప్రభుత్వం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట సమయంలోనే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వా త పౌష్టికాహారం అందించి ఇంటికి పంపాలి. కేంద్రాల వద్ద వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వహణ పకడ్బందీగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
నేటి నుంచి జూనియర్ కళాశాలల పునఃప్రారంభం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను గురువారం నుంచి పునఃప్రారంభించననున్నట్లు ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఎండలు ఎక్కుగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే మధ్యాహ్నం వరకే కళాశాలలను నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలను కల్పించాలని సూచించారు. కాగా, ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇంటర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో అడ్మిషన్లపై ప్రిన్సిపాళ్లు అయోమయంలో ఉన్నారు. కాగా, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యంకనం పూర్తయింది. -
13 నుంచి ఒంటిపూట బడులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఈ నెల 13 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా విద్యార్థులు అనారోగ్యం పాలుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అలాగే సర్వశిక్షాభియాన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీఆర్పీ, ఐఈఆర్టీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డీపీవోలు, కేజీబీవీ, పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు, మెసెంజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల జీతాలు మూడు శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆంజనేయులు తెలిపారు. 2014 జూన్ తరువాత వారి జీతాలు పెరగలేదని ప్రభుత్వానికి వివరించినట్టు చెప్పారు. -
16 నుంచి ఒంటిపూట బడులు
టీటీజేఏసీ నేతలతో భేటీలో డిప్యూటీ సీఎం కడియం ► ఏకీకృత సర్వీసు రూల్స్‌పై త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలు ► ఎయిడెడ్ టీచర్లకు ప్రతి నెలా వేతనాలు చెల్లించేలా చర్యలు ► టెన్త్ పరీక్షల విధుల బహిష్కరణ వాయిదా: టీటీజేఏసీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు పెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. పాత పద్ధతిలోనే విద్యా సంవత్సరాన్ని కొనసాగిస్తామని చెప్పారు. స్కూళ్లకు ఏప్రిల్ 23 చివరి పని రోజని, జూన్ 13న తిరిగి బడులు ప్రారంభమవుతాయన్నారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తెలంగాణ టీచర్స్ జేఏసీ (టీటీజేఏసీ) ఇటీవల పరీక్ష విధుల బహిష్కరణ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం టీటీజేఏసీ నేతలతో సమావేశమైన కడియం...వారి డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ రూపకల్పనకు చర్యలు చేపడతామన్నారు. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ త్వరలోనే ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మోడల్ స్కూల్ టీచర్లకు పదో పీఆర్సీ వర్తింపజే యడంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎయిడెడ్ టీచర్లకు వేతనాలను ప్రతి నెలా చెల్లించడంపై ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. గ్రేడ్-2 పండిట్ పోస్టులను గ్రేడ్-1 పండిట్లుగా అప్‌గ్రేడ్ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభం, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సీపీఎస్ విధానం రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం వర్తింపు, సకల జనుల సమ్మెలో పాల్గొన్న టీచర్లకు 16 రోజుల ఈఎల్స్, పదో పీఆర్సీ బకాయిల చెల్లింపు, హెల్త్ కార్డులు తదితర డిమాండ్లను పరిశీలిస్తామని కడియం హామీ ఇచ్చారు. ఈ భేటీ అనంతరం టీటీజేఏసీ చైర్మన్ పులి సరోత్తంరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎంతో చర్చలు సఫలమైనందున పదో తరగతి పరీక్ష విధుల బహిష్కరణను ఉపసహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కడియంతో భేటీలో టీటీజేఏసీ సెక్రటరీ జనరల్ బి.భుజంగరావు, జేఏసీ ప్రతినిధులు ఎండీ అబ్దుల్లా, మల్లయ్య, సాయిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, దమనేశ్వర్రావు, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.