సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఈనెల 4వ తేదీనుంచి ఒంటిపూట బడులుగా నడవనున్నాయి. వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సోమవారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు ఒంటిపూట బడు లు ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీనుంచి 13వ తేదీ వరకు టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి.
చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి
Comments
Please login to add a commentAdd a comment