ఉర్దూ యూనివర్సిటీ పీజీసెట్ ఫలితాలు విడుదల
Published Fri, Jun 9 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
కర్నూలు సిటీ: డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తార్ సాహెబ్ విడుదల చేశారు. మొత్తం 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 56 మంది అర్హత సాధించారని అన్నారు. ఈ నెల12 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని, ఎంఏ ఇంగ్లిషు, ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, 13వ తేదీన ఎంఏ ఉర్దూ, ఎంకామ్ జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు జిరాక్స్‌కాపీలు తీసుకోరావాలన్నారు.
Advertisement
Advertisement