pgcet
-
తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగిన లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. ►లాసెట్ ఫలితాలు.. ఫలితాలు డైరెక్ట్ లింక్ ఇదే.. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్, లా సెట్ కన్వీనర్.. జిబి రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీ–శాట్ ద్వారా ఉచిత శిక్షణ కొనసాగుతుందని ఇంటర్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సమయంలో 2020లో ప్రారంభించిన ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని, ఇప్పటికే 12 వేల మంది నమోదు చేసుకు న్నారని బోర్డ్ స్పష్టం చేసింది. జాతీయ పోటీ పరీక్షలపై సమగ్ర శిక్షణ ఇవ్వడమే కాకుండా, మోడల్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టీ–శాట్ ద్వారా సాయంత్రం 6.30 గం టల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదు పాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇంజనీరింగ్ పీజీసెట్– 2022 గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఇంజనీరింగ్ పీజీసెట్ (టీఎస్ పీజీఈసీఈటీ– 2022) దరఖాస్తులకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు గడువు పొడిగించి నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. చివరి సంవత్సరం పరీక్షలు రాసే బీఈ, బీటెక్ విద్యార్థులు, వివిధ రకాల సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పీజీఈసెట్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15లోగా విద్యార్థులందరికీ యూనిఫాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జూలై 15లోగా యూనిఫాం అందజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్‌ను రూపొందించి జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యా యులకు పంపింది. మొత్తం 33 జిల్లాల్లో 22,78,569 మంది విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరికి 67,75,522 మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేసి, ఈమేరకు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి దశలో 24,69,214 మంది విద్యార్థులకు జూలై 4వ తేదీలోగా యూనిఫాం అందించాలని, మిగతా విద్యార్థులకు జూలై 15లోగా ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. కొత్తగా ప్రవేశం పొందే వారికి కూడా యూని ఫాం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ ప్రక్రియ జూలై నెలాఖరుకల్లా పూర్తయ్యే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (క్లిక్: గురుకులాల్లో మరో 1,000 కొలువులు!) -
AP: ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి(బుధవారం) నుంచి ఆన్లైన్లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: AP: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్లైన్లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 22వ తేదీన పీజీ సెట్ పరీక్ష జరగనుంది. -
20 వరకు వైఎస్సార్ఏఎఫ్యూ పీజీసెట్ దరఖాస్తు గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కడపలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 6 కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీసెట్)కు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు నిర్ణయించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథరెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ప్లానింగ్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్), మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్), పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హతలు, ఇతర వివరాలకు www.ysrafu.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. ఈ కోర్సుల్లో చేరాలనుకొనే వారు డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 రాయవలసి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20 చివరి తేదీ. ఆలస్య రుసుముతో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 8790571779 నంబర్లో సంప్రదించవచ్చు. ఆయా కోర్సుల్లో సీట్లు ఇలా.. ♦మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ప్లానింగ్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్): 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్): 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ: 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సైంటిఫిక్ వాస్తు శాస్త్ర: 20 సీట్లు -
వైవీయూకు ఏపీ పీజీసెట్–21 నిర్వహణ బాధ్యతలు
వైవీయూ (వైఎస్సార్ జిల్లా): ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)–2021 నిర్వహణ బాధ్యతలను కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయానికి (వైవీయూ) అప్పగిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా వంటి 127 కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ సెట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పీజీ కళాశాలలు, అనుబంధ కళాశాలలు, ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనార్టీ కళాశాలల్లో 2021–22కి గానూ పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి పీజీ సెట్ నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన, చివరి సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఏపీ పీజీసెట్ చైర్మన్‌గా వైవీయూ వీసీ ఏపీ పీజీసెట్–2021 చైర్మన్‌గా వైవీయూ వైస్ చాన్స్‌లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, సెట్ కన్వీనర్‌గా వైవీయూ భౌతికశాస్త్ర ఆచార్యులు వై.నజీర్అహ్మద్ వ్యవహరించనున్నారు. వీరితో పాటు ఎస్వీయూ, ఆంధ్ర విశ్వవిద్యాలయాల రీజియన్ నుంచి వైస్ చాన్స్లర్లు, ఏపీ ఉన్నతవిద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కళాశాల విద్య కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఆచార్య సూర్యకళావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం, నిర్వహణ బాధ్యతలు యోగివేమన వర్సిటీకి అప్పజెప్పడం సంతోషకరమన్నారు. కన్వీనర్ ఆచార్య వై.నజీర్అహ్మద్ మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల తేదీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. -
ఆగస్టు 19 నుంచి ‘సెట్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్–2021 సహా వివిధ సెట్ల షెడ్యూళ్లను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఆగస్టు 19 నుంచి 25 వరకు జరగనుందన్నారు. ఏపీఈఏపీ సెట్ గతంలో ఏపీ ఎంసెట్‌గా ఉండేది. ఈఏపీ సెట్‌తో పాటు ఇతర సెట్ల పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వెల్లడించారు. -
తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలు ఖరార య్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఆయా తేదీలను శుక్రవారం ప్రకటించారు. ప్రధానమైన ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ బీఈ/బీటెక్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాల కోసం ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలి పారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీఈ/బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈసెట్‌ను జూలై 1వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి జూన్ 14వ తేదీ తరువాత ఎప్పుడైనా సెట్స్‌ను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మం డలి సిద్ధంగా ఉన్నా, ఆన్లైన్ పరీక్షలను నిర్వ హించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ ఖాళీ స్లాట్స్ జూన్ లో ఎక్కువగా లేకపోవడం, పైగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరమ్యే ఎంసెట్ పరీక్ష లను నిర్వహించేందుకు టీసీఎస్‌కు జూన్ లో సిబ్బంది కొరత ఉంటుందనే కారణంతో జూలై లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడిం చారు. అయితే తక్కువ మంది విద్యార్థులు హాజ రయ్యే పీజీఈసెట్‌ను జూన్ 20 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఫార్మ్–డి(పీబీ), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో దీని ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా అనేక ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్న టీసీఎస్ ప్రతినిధులతో చర్చించి, ఖాళీగా ఉన్న స్లాట్స్‌లో సెట్స్ తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అలాగే అన్ని సెట్స్‌కు నిర్వహణ యూనివర్సిటీలను, కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు. 70 శాతం సిలబస్‌తో ఎంసెట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్, ‘ప్రథమ’లో పూర్తి సిలబస్‌తో ఎంసెట్‌ను నిర్వహి స్తామన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం జరిగినందున ఇంటర్‌బోర్డు కూడా సిలబస్‌ను, మోడల్ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచిందన్నారు. ఎంసెట్ పేపరు సెట్టింగ్ సమయంలో ఆ సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు. సిలబస్ వివరాలను కూడా ఎంసెట్ నోటిఫికేషన్ సమయంలో వెబ్సైట్లో ఎంసెట్ కమిటీ అందుబాటులో ఉంచుతుందని వివరించారు. ఎంసెట్ నోటిఫికేషన్ వారం, పదిరోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో లేదా ఆగస్టులో... మరో నాలుగు సెట్స్ తేదీలను ఇంకా ఖరారు చేయలేదని పాపిరెడ్డి తెలిపారు. వాటిని జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్, 3 ఏళ్లు, 5 ఏళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. సాధారణ పరిస్థితుల్లో మార్చిలో ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్‌లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు జరిగేవన్నారు. వాటి ప్రకారం మే నెలలో ఎంసెట్, ఇతర సెట్స్ నిర్వహించే వారిమన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ పరీక్షలన్నీ రెండు నెలలు ఆల స్యంగా నిర్వహించాల్సి వస్తోంద న్నారు. యూనివర్సిటీల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, ప్రస్తుతం ప్రత్యక్ష బోధన మొదలైనందున త్వరలోనే ఆయా పరీక్షల తేదీలు ఖరారు అవుతాయన్నారు. వాటిని బట్టి ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని వివరించారు. చదవండి: బాబోయ్... ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? -
ఎంసెట్, ఈసెట్, ఐసెట్ తేదీలు ఖరారు
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. లాక్డౌన్ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎంసెట్‌తో పాటు లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్, ఈసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. హేమచంద్ర రెడ్డి వెల్లడించారు. కరోనా, లాక్డౌన్లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని మండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్సు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి 23వరకు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా తాజాగా సవరించిన షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఉన్నత విద్యామండలి ప్రకటించిన పరీక్ష తేదీలు ఎంసెట్ : జులై 27 నుంచి 31 వరకు ఈసెట్ : జులై 24 ఐసెట్ : జులై 25న పీజీసెట్ : ఆగస్ట్ 2 నుంచి 4 ఎడ్ సెట్ : ఆగస్టు 5 లా సెట్ : ఆగష్టు 6 ఈసెట్ : ఆగష్టు 7 నుంచి 9 వరకు -
ఉర్దూ యూనివర్సిటీ పీజీసెట్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తార్ సాహెబ్ విడుదల చేశారు. మొత్తం 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 56 మంది అర్హత సాధించారని అన్నారు. ఈ నెల12 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని, ఎంఏ ఇంగ్లిషు, ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, 13వ తేదీన ఎంఏ ఉర్దూ, ఎంకామ్ జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరు అయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు జిరాక్స్‌కాపీలు తీసుకోరావాలన్నారు. -
19 నుంచి ఆర్యూ పీసెట్ కౌన్సిలింగ్
కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో పీజీలో చేరేందుకు ఈనెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు. జనరల్ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ. 150 ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకోరావాలని సూచించారు. 19వ తేదీ ఉదయం – ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, మధ్యాహ్నం – బోటని, బయోటెక్నాలజీ, 20న ఉదయం – కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, డెటా సైన్స్, మధ్యాహ్నం – ఇంగ్లిషు, స్టాటిస్టిక్స్, 21వ తేదీ ఉదయం – ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, మధ్యాహ్నం – ఫిజిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, 22వ తేదీ ఉదయం – జువాలజీ, మైక్రో బయాలజీ, మధ్యాహ్నం – తెలుగు, 23వ తేదీ ఉదయం – మ్యాథ్స్, మధ్యాహ్నం – మ్యాథ్స్, కామర్స్, 24వ తేదీ ఉదయం – మ్యాథ్స్, మధ్యాహ్నం – మ్యాథ్స్, 25వ తేదీ ఉదయం – సైన్స్ సబ్జెక్టులు, మధ్యాహ్నం – ఆర్ట్స్ సబ్జెక్టుల ( ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పీహెచ్, సీఏపీ, స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కలిగిన అభ్యర్థుల )కు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కన్వీనర్ తెలిపారు. -
25 నుంచి ఆర్యూ పీజీ సెట్
కర్నూలు(ఆర్యు): ఈ నెల 25 నుంచి 27వతేదీ వరకు ఆర్యూ పీజీ సెట్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10 వరకు, 11 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, 4 నుంచి 5:30 గంటల వరకు ప్రతిసారీ గంటన్నర సమయంలో నిర్వహిస్తామన్నారు. జిల్లాకు సంబంధించి కర్నూలు జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, వెంకాయపల్లె రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల, నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఆదోనిలోని ఆదోని ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కళాశాలల కేంద్రాలుగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. 25వ తేదీన మైక్రోబయాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, భౌతిక శాస్త్రం, ఎకనామిక్స్, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, తెలుగు. 26వ తేదీన మాథమేటిక్స్, బోటని, కామర్స్, 27వ తేదీన కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్ (ఓఆర్, ఎస్, క్యు, సి) ఇంగ్లీషు, బయోకెమిస్ట్రీ, డాటా సైన్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 18 విభాగాలకు గాను 4,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్సైట్(www.rudoa.in/www.ruk.ac.in)లో వెబ్సైట్లో చూడవచ్చని కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
ఆర్యూ పీజీ సెట్ గడువు పొడిగింపు
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు, వర్సిటీ ప్రాంగణంలోని కళాశాల పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు పీజీ సెట్ కన్వీనర్ సి.వి.కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఉన్న గడువును 30వ తేదీ వరకు పొడిగించారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో మే నెల 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్షలన్నీ ఆన్లైన్లో షెడ్యూల్ ప్రకారమే అంటే మే నెల 24, 25, 26 తేదీల్లో నంద్యాల, ఆదోని, కర్నూలు కేంద్రాలుగా నిర్వహిస్తామని తెలిపారు. -
పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్ (వరంగల్) : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం 2016-2017లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను సోమవారం నోటిఫికేన్ విడుదలైంది. ఈ పీజీ సెట్‌కు అడ్మిషన్ల ప్రక్రియలో తొలిసారిగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.కష్ణారెడ్డి, జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ సోమవారం వెల్లడించారు. అభ్యర్థులు మీసేవా లేదా ఏపీ ఆన్లైన్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కేయూ అడ్మిషన్ల వెబ్సైట్ www.kakatiya.ac.in లేదా www.kudoa.in ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా క్రెడిట్ కార్డు, డిబెట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రిజస్ట్రేషన్ ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్లకు సంబంధించిన నియమ నిబంధనలు వెబ్సైట్లో ఉంచారు. అపరాధ రుసుము లేకుండా మే 3వ తేదీ వరకు, రూ.600 అపరాధ రుసుముతో మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆన్లైన్ అప్లికేషన్ హెల్ప్‌లైన్ కేంద్రం నంబర్లు 90524 565721, 99856 66721కు ఫోన్ చేయవచ్చని అడ్మిషన్ల డైరెక్టర్ తెలిపారు. మే చివరి వారంలో పీజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నామని, ప్రవేశ పరీక్షల సమయంలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే తమ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
ఏఎన్‌యూ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో 2016-17 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్‌యూ పీజీ సెట్ నోటిఫికేషన్‌ను సోమవారం వైస్ చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. మార్చి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు మే నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తామని పీజీ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ ఎం.రామిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు, ఆన్లైన్ దరఖాస్తుకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఏఎన్‌యూ మాజీ రెక్టార్ ఆచార్య వైపీ రామసుబ్బయ్య, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య వి.చంద్రశేఖర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య వై.కిషోర్, పీజీ పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఏదీ 'సెట్' కాలేదు
సకాలంలో వృత్తి విద్యా ప్రవేశాలు మిథ్య సుప్రీంకోర్టు ఆదేశించినా ఏటా ఇదే పరిస్థితి అన్ని కోర్సుల్లోనూ ప్రవేశాలు గందరగోళమే ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇప్పటికీ అసంపూర్ణమే! ఈసెట్, పాలిసెట్ అలాట్మెంట్లు మాత్రమే పూర్తి ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, లాసెట్.. అన్నీ అంతే! అడ్మిషన్ల కోసం లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. విధానపర నిర్ణయాల్లో జాప్యం.. తప్పుడు నిర్ణయాల ఫలితం.. ఏదైతేనేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల పరిస్థితి ఏటా గందరగోళంగా మారుతూనే ఉంది.. అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కౌన్సెలింగ్ కోసమే విద్యార్థులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటూనే ఉంది.. గడిచిన ఐదారేళ్లలో ఏ విద్యా సంవత్సరంలోనూ సరిగ్గా తరగతులు ప్రారంభమైంది లేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా అదే పరిస్థితి. ఈసారి కూడా అదే దుస్థితి. రాష్ట్ర విభజన సమస్యలు, అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం, ప్రభుత్వాల మొండిపట్టు వంటివన్నీ ప్రవేశాలు ఆలస్యం కావడానికి కారణమయ్యాయి. ఈసారీ పరిస్థితి అంతే. విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభం కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తి ఏ ఒక్క కోర్సు ప్రవేశాల్లోనూ కనిపించడం లేదు. జూలై 31 నాటికే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కోర్సులకు అయితే ప్రవేశాల షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, పాలిసెట్, లాసెట్ అన్నింటి పరిస్థితీ ఇంతే. ఏటా ప్రవేశాలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో.. లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంసెట్..: విద్యార్థులకు ఆవేదనే! ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ విద్యార్థులకు ఆవేదనే మిగిల్చింది. కాలేజీలకు అఫిలియేషన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మొండిపట్టు వంటివాటి కారణంగా కౌన్సెలింగ్ జాప్యమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగినా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మొదటి దశలో సీట్లు పొందిన వారు ఇతర కాలేజీల్లోకి మారలేకపోయారు, పూర్తిస్థాయిలో ఆప్షన్లు పెట్టుకోక సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లేకుండా పోయింది. చివరకు విద్యార్థులే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అవకాశం వస్తుందో లేదో తెలియదు. మొదటి దశలో చేరిన 1.04 లక్షల మంది విద్యార్థులకు మాత్రం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఎంసెట్ మేనేజ్మెంట్ కోటా భర్తీ, బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది. పీజీఈసెట్: అంతా గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొదట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. ఎడ్‌సెట్..: అఫిలియేషన్లకే దిక్కులేదు ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్)లో ప్రవేశాలు చేపట్టాల్సిన కాలేజీలకు ఇంతవరకు అఫిలియేషన్ల ప్రక్రియే పూర్తి కాలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 23వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినా... ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ కౌన్సెలింగ్‌తో తెలంగాణ, ఏపీల్లోని 69,068 బీఎడ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన 1,47,188 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని 261 కాలేజీల్లో 27,744 సీట్లు అందుబాటులో ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లోని 386 కాలేజీల్లో 41,324 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. డైట్‌సెట్..: పరిస్థితి మరీ దారుణం ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం డైట్‌సెట్‌లో అర్హత సాధించిన 2,25,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించి 650కు పైగా ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. అఫిలియేషన్లు లభిస్తే తప్ప ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసే పరిస్థితి లేదు. అనేక డీఎడ్ కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. దీంతో ప్రభుత్వాలు ఎన్నింటికి, ఎప్పుడు అనుమతిస్తాయో.. పాఠశాల విద్యా శాఖలు అఫిలియేషన్లు ఇస్తాయో తెలియదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల భర్తీ కూడా ఆగిపోయింది. 2012లో అయితే ఏకంగా ఫిబ్రవరిలో తరగతులు ప్రారంభించారు. ఇక ఈసారి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. పీఈసెట్: ఇంకా రాని షెడ్యూల్ వ్యాయమ ఉపాధ్యాయ కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)లో ప్రవేశాల కోసం ఇంకా షెడ్యూల్ జారీ కాలేదు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టాలని మాత్రం నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల్లోని దాదాపు 40 కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాల్సి ఉంది. ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసి.. వచ్చే నెల 6 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 11న సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఐసెట్..: ఆలస్యం తప్పేలా లేదు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను శనివారం జారీ చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్లు లభించాల్సి ఉంది. 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల తనిఖీ, 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రవేశాల కోసం ఐసెట్‌లో అర్హత సాధించిన 1,19,756 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై దృష్టి సారించాలని భావించడంతో.. దీనికి ఆలస్యం తప్పడం లేదు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కలిపి మొత్తం 1.20 లక్షల వరకు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా.. తెలంగాణలోని 539 కాలేజీల్లో దాదాపు 64 వేల సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 628 కాలేజీల్లో 56 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. లాసెట్దీ అదే పరిస్థితి.. లాసెట్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ లాసెట్, పీజీ లాసెట్‌లో అర్హత సాధించిన వారు 19 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ (ఈసెట్) ప్రవేశాలు పూర్తయి, 12న తరగతులు ప్రారంభమయ్యాయి. పీజీఈసెట్ గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొద ట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. -
వచ్చే ఏడది కూడా ఉమ్మడి 'సెట్స్'