సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి(బుధవారం) నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: AP: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 22వ తేదీన పీజీ సెట్ పరీక్ష జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment