సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. లాక్‌డౌన్ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంసెట్‌తో పాటు లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్, ఈసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. హేమచంద్ర రెడ్డి వెల్లడించారు.
కరోనా, లాక్‌డౌన్‌లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని మండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్సు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షలను జులై 18 నుంచి 23వరకు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా తాజాగా సవరించిన షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఉన్నత విద్యామండలి ప్రకటించిన పరీక్ష తేదీలు
ఎంసెట్ : జులై 27 నుంచి 31 వరకు
ఈసెట్ : జులై 24
ఐసెట్ : జులై 25న
పీజీసెట్ : ఆగస్ట్ 2 నుంచి 4
ఎడ్ సెట్ : ఆగస్టు 5
లా సెట్ : ఆగష్టు 6
ఈసెట్ : ఆగష్టు 7 నుంచి 9 వరకు
Comments
Please login to add a commentAdd a comment