
'కర్నూలులో అంతర్జాతీయ విమానాశ్రయం'
కర్నూలు: వచ్చే ఏడాది నుంచి ఉర్దూ కోసం ప్రత్యేక డీఎస్సీ ని నిర్వహిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న ఉర్దూ విశ్వవిద్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొని మాట్లాడారు. ఉర్దూ యూనివర్సిటీ కోసం 125 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల నుంచి ఇమామ్ లకు రూ. 5 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు.
అదేవిధంగా షాదీఖానా కోసం స్థలం కేటాయిస్తున్నామన్నారు. కర్నూలులో 900 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకాబోతుందన్నారు. మరో వైపు కర్నూలు లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అనంతరం ఆయన గోరుకల్లుకు చేరుకుని అక్కడ రిజర్వాయర్ పరిశీలించారు.