నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా నరసింహారావు
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం ఆచార్యుడు ఏ.నరసింహారావు నియమితులయ్యారు.
-
నరసింహారావును అభినందిస్తున్న ఏయూ వీసీ నాగేశ్వరరావు
ఏయూక్యాంపస్: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం ఆచార్యుడు ఏ.నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు నన్నయ వర్సిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో అభినందించారు. పటిష్టమైన అనుబంధ కళాశాలలను కలిగిన ఆదికవి నన్నయ వర్సిటీ నిర్వహణ ఎంతో కీలకమన్నారు. వీసీ ఆచార్య ముత్యాలనాయుడుతో సమన్వయం జరుపుతూ నన్నయ వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు.
ఆచార్య నరసింహారావు ఫైనాన్స్, అకౌంటిగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో నిపుణుడు. క్రమశిక్షణ, సమయ పాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. వర్సిటీ పరిపాలనా వ్యవహారాలపై పూర్తి పట్టు కలిగి, సమర్థవంతునిగా నిరూపించుకున్నారు.
22న బాధ్యతల స్వీకరణ
సోమవారం రాజహేంద్రవరంలో ఆచార్య నరసింహారావు బాధ్యతలు స్వీకరిస్తారు. నరసింహారావు ఎంకాం, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఏయూ ఆర్ట్స్ కళాశాల వార్డెన్‌గా, దూరవిద్యలో ఎంబీఏ కోర్సు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఏఐసీటీæఈ తనికీ బందం సభ్యుడిగా, ఏయూ సీపీసీ సభ్యుడిగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేట్ సభ్యునిగా ఉన్నారు. ఐసెట్ ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో పనిచేశారు. ఎటువంటి ప్రచారాన్ని కోరుకోకుండా నిరాడంబరంగా పనిచేయడం ఆచార్య నరసింహారావు వ్యక్తిత్వానికి నిదర్శనం.