Nannayya University
-
‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు
రాజానగరం: తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి శుక్రవారానికి 16 సంవత్సరాలు పూర్తయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల వాంఛ మేరకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతినిచ్చారు. సాంస్కృతిక, సాహిత్య రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ పేరిట దీనిని ఏర్పాటు చేసేందుకు ఎన్నో పోరాటాలు కూడా జరిగాయి. ఎట్టకేలకు 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని 22–6–2016న వెలసిన ఈ యూనివర్సిటీ స్వశక్తితో అచిరకాలంలోనే అభివృద్ధిని సాధిస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటోంది. కరోనా ప్రభావాన్ని అధిగమిస్తూ ... రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ ప్రభావం సమాజాన్ని ఏవిధంగా ప్రభావితం చేసినా, ఆదికవి నన్నయ యూనివర్సిటీ దానిని కూడా ఒక అవకాశంగా మార్చుకోగలిగింది. 2020 మార్చి నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతవేయవలసి రావడంతో విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ తరుణంలో విద్యార్థుల భవిషత్తును దృష్టిలో పెట్టుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉపకులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు ఆదేశాలను అనుసరించి ఆన్లైన్ క్లాసులతోపాటు వివిధ అంశాలపై నిష్టాతులతో వెబినార్లు నిర్వహించారు. ఈ వెబినార్ల నిర్వహణలో దేశంలో ఏ యూనివర్సిటీ సాధించని రీతిలో వంద మార్కును దాటేయడంతో ఒకేసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులోను చోటు దక్కించుకోగలిగింది. జనావళికి కరోనా వైరస్ నుంచి ఎదురవుతున్న భయాందోళనను తొలగిస్తూ, ఆత్మస్థైర్యాన్ని అందించే విధంగా సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను కూడా ‘నన్నయ’ వర్సిటీ సైకాలజీ విభాగం అధ్యాపకులు అందించారు. 11 వేల పుస్తకాలతో ‘నన్నయ’ విజ్ఞాన భారతి క్యాంపస్‌లోని సెంట్రల్ లైబ్రరీలో దాతలు అందించిన 11 వేల పుస్తకాలతో విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా ‘నన్నయ’ భారతిని ప్రారంభించారు. జె.స్టోర్, జె.గేట్ సేవలను కొనుగోలు చేసి విద్యార్థులు, అధ్యాపకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో సైన్స్ జర్నల్‌ని కూడా ‘నన్నయ’ విజ్ఞాన భారతిలో అందుబాటులోకి తెచ్చారు. ‘నాక్’ గుర్తింపును సాధిస్తాం ‘నాక్’ గుర్తింపును సాధిస్తాం. ఇందుకు అవసరమైన కసరత్తు వేగంగా జరుగుతోంది. ఎస్ఎస్ఆర్ కూడా సమర్పించాం. కరోనా వైరస్ ప్రభావం వల్ల కొంత జాప్యం జరిగింది. ఇప్పటికే ఐఎస్ఓ, ఏఐసీటీఈ గుర్తింపులు సాధించాం. ‘ఇంటర్నేషనల్ స్టూడెంట్ పోర్టల్ ద్వారా అంతర్జాతీయంగా విద్యార్థులకు యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తున్నాం. – ఆచార్య ఎం.జగన్నాథరావు, ఉపకులపతి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ -
రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
-
వేధింపులపై వారే సీఎంకు లేఖ రాశారు
సాక్షి, రాజానగరం: ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్రపై వచ్చిన లైంగిక వేధింపులపై ప్రాథమిక విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురేష్‌వర్మ శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. వేధింపులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖను 2017- 19 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురు విద్యార్థినిలకు ఫోన్లు చేస్తే.. సరిగా రెస్పాండ్ కావడం లేదనీ.. అంతేకాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారని తెలిపారు. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు యూనివర్సిటీలో ఉన్న సమయంలో తాను వీసీగా లేనని అన్నారు. ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్న విద్యార్థులు ఎవరైనా తెలుగులో ఉత్తరం రాస్తారా..? పైగా విద్యార్థులు రాసిన లేఖలో వారి సంతకాలు కూడా లేవని సందేహం వ్యక్తపరిచారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, ఇందులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో తెలుసుకుని యూనివర్సిటీ తరఫున క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. చదవండి: నన్నయ వర్సిటీలో లైంగిక వేధింపులు -
నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా నరసింహారావు
నరసింహారావును అభినందిస్తున్న ఏయూ వీసీ నాగేశ్వరరావు ఏయూక్యాంపస్: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం ఆచార్యుడు ఏ.నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు నన్నయ వర్సిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో అభినందించారు. పటిష్టమైన అనుబంధ కళాశాలలను కలిగిన ఆదికవి నన్నయ వర్సిటీ నిర్వహణ ఎంతో కీలకమన్నారు. వీసీ ఆచార్య ముత్యాలనాయుడుతో సమన్వయం జరుపుతూ నన్నయ వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు. ఆచార్య నరసింహారావు ఫైనాన్స్, అకౌంటిగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో నిపుణుడు. క్రమశిక్షణ, సమయ పాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. వర్సిటీ పరిపాలనా వ్యవహారాలపై పూర్తి పట్టు కలిగి, సమర్థవంతునిగా నిరూపించుకున్నారు. 22న బాధ్యతల స్వీకరణ సోమవారం రాజహేంద్రవరంలో ఆచార్య నరసింహారావు బాధ్యతలు స్వీకరిస్తారు. నరసింహారావు ఎంకాం, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, పీహెచ్డీ పూర్తిచేశారు. ఏయూ ఆర్ట్స్ కళాశాల వార్డెన్‌గా, దూరవిద్యలో ఎంబీఏ కోర్సు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఏఐసీటీæఈ తనికీ బందం సభ్యుడిగా, ఏయూ సీపీసీ సభ్యుడిగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేట్ సభ్యునిగా ఉన్నారు. ఐసెట్ ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో పనిచేశారు. ఎటువంటి ప్రచారాన్ని కోరుకోకుండా నిరాడంబరంగా పనిచేయడం ఆచార్య నరసింహారావు వ్యక్తిత్వానికి నిదర్శనం.