
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో బండి సంజయ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2020 నవంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్‌పై కేసు నమోదైంది. కార్యకర్తల సమావేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కేసు నమోదైంది. సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. మార్కెట్ పీఎస్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరఫు న్యాయవాది అన్నారు. సాక్ష్యుల వాంగ్మూలంలోనూ తేడాలున్నాయన్నారు. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్న న్యాయవాది వివరించారు. బండి సంజయ్‌పై కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment