తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట | TRS Leader Karne Prabhakar Comments On Telangana Budget 2019 | Sakshi
Sakshi News home page

ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ : నోముల నర్సింహయ్య

Published Mon, Sep 9 2019 1:46 PM | Last Updated on Mon, Sep 9 2019 2:01 PM

TRS Leader Karne Prabhakar Comments On Telangana Budget 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌ అన్నారు. సోమవారం బడ్జెట్‌ కేటాయింపుల అనంతరం మండలి మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో  సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వివిధ పథకాలకు కేటాయింపులు తగ్గించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు బాగున్నాయని అన్నారు. 

ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ : నోముల నర్సింహయ్య
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజల బడ్జెటని, ప్రజారంజకంగా ఉందని టీఆర్‌ఎస్‌ నేత నోముల నర్సింహయ్య కొనియాడారు. సోమవారం బడ్జెట్‌ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌  అన్ని సంక్షేమ రంగాలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement