హన్మకొండ అర్బన్:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే విధులపై నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్న ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ జి.కిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించిన ఎన్యూమరేటర్లు సర్వేకు సంబంధించిన శిక్షణకు గానీ, విధులకు గానీ రాకపోతే సదరు ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ నిలిపివేసేవిధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే పనులు, శిక్షణ కార్యక్రమాలపై శనివారం రాత్రి కలెక్టరేట్‌లో సమీక్షించారు.
ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు సుమారు 2వేల మంది ఉద్యోగులు హాజరుకాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణకు రానివారు, కొత్తగా సమాచారం అందుకున్న ప్రైవేటు ఉద్యోగులు ఆదివారం(17న) ఉదయం కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాలని చెప్పారు.
సిబ్బంది కొరత కారణంగా ప్రైవేటు ఇంజనీరింగ్, జూనియర్ కళాశాలల సిబ్బంది, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది, ఎన్‌ఐటీ, సీకేఎం కళాశాల సిబ్బందిని సర్వే విధులకు ఎంపిక చే స్తున్నామని, వీరికి శిక్షణ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ పౌసుమిబసు, నగర కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్‌కరణ్, సీపీవో బీఎన్‌రావు, ఈడీవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
సర్వే డ్యూటీకి రాకుంటే ఇంక్రిమెంట్ నిలిపివేస్తాం
Published Sun, Aug 17 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement