కిడ్స్ డిజైన్ | Kids design | Sakshi
Sakshi News home page

కిడ్స్ డిజైన్

Published Tue, Jan 6 2015 1:00 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Kids design

Show Masters
 
పిల్లలుంటే పండుగ. పండుగ అంటేనే పిల్లలు. క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయాయి. ఇక సంక్రాంతి.. ఈ పండుగకు ‘కళ’ తెచ్చే చిల్డ్రన్ కోసం డిఫరెంట్లీ డిజైన్డ్ డ్రెస్‌లు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. వీటిని పరిచయం చేసేందుకు అందమైన చిన్నారి మోడల్స్ ఉండనే ఉన్నారు. దీంతో ఇప్పుడు చిన్నారుల ఫ్యాషన్ షోలు ఊపందుకున్నాయి. మరోవైపు తమ డిజైనర్ల సత్తా చూపడానికి కిడ్స్ డ్రెస్‌ల డిజైనింగ్ ఒక మార్గంగా ఎంచుకుంటున్నాయి ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్.
 ..:: ఎస్.సత్యబాబు
 
అమ్మాయిల తర్వాత డ్రెస్సింగ్ స్టైల్స్‌లో బోలెడన్ని వెరైటీలు అందుబాటులో ఉన్నది పిల్లలకే. సింపుల్‌గా రెడీమేడ్‌తో సరిపెట్టేసే రోజులకు బైబై చెప్పేస్తున్న పేరెంట్స్ పిల్లల దుస్తులపై శ్రద్ధ పెడుతున్నారు. తమ అలంకరణ సంగతి ఎలా ఉన్నా పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లకు వెళుతున్నప్పుడు పిల్లలు గ్రాండ్‌గా కనపడాలని ఆరాట పడుతున్నారు. పిల్లల డ్రెస్సింగ్‌కు వచ్చే కాంప్లిమెంట్లు సహజంగానే దానికి కారణమైన పేరెంట్స్‌కు దక్కుతాయి కాబట్టి.. తమ క్యూట్ డార్లింగ్స్ ధరించే దుస్తుల్లో వెరైటీ కోసం డిజైనర్ల దగ్గర క్యూ కడుతున్నారు.
 
చిన్నారులకు డిజైనింగ్ ఓ సవాల్...

క్యూట్‌గా, హ్యాపీ లుక్స్‌తో ఉండే చిన్నారులకు స్టైల్స్ క్రియేట్ చేయడం ఛాలెంజ్‌లాంటిదని డిజైనర్ల అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు ఏ దుస్తుల్లోనైనా అందంగా కనిపిస్తారు. ఇన్నోసెన్స్, స్పాంటేనియటీ, బ్రైట్ స్మైలింగ్.. చిల్డ్రన్‌కు నేచురల్‌గా వచ్చే అలంకారాలు. డ్రెస్ ద్వారా వాటిని మరింత మెరపించాల్సిన బాధ్యత డిజైనర్‌లపై ఉంటుంది. మరోవైపు  పార్టీలకు పిల్లల్ని తీసుకెళ్లడం కూడా ఇటీవల బాగా పెరిగింది. అలాంటి చోట తమ పిల్లల డ్రెస్సింగ్ అద్భుతంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు. దీని కోసం పెద్దవాళ్ల కన్నా మిన్నగా తమ పిల్లల డ్రెస్ కోసం ఖర్చు పెడుతున్నారు.
 
ఎన్నెన్నో వెరైటీలు...

చిన్నారుల దుస్తుల డిజైన్లకు వెరైటీ థీమ్‌లను ఎంచుకుంటున్నారు డిజైనర్లు. మోడ్రన్ యుగపు ప్రతినిధులుగా కనిపించేలా చేసే ఇండోవెస్ట్రన్స్, ఫంకీగా అనిపిస్తూ అందర్నీ ఆకట్టుకునే డిస్కోవేర్, రెండు మూడు రకాల థీమ్‌లను కలిపి రూపొందించే కాక్‌టైల్ వేర్, నగర శివార్లలోని రిసార్ట్స్‌కు వెళ్లినప్పుడు ధరించేందుకు వీలుగా రిసార్ట్ వేర్, పెళ్లిళ్లు వంటి సందర్భాలకు నప్పే వెడ్డింగ్ వేర్... ఇలా పెద్దలకు ధీటుగా చిన్నారులకు ప్రత్యేకమైన థీమ్ డిజైన్లు వచ్చేశాయి.
 
హిట్ ‘షో’..

కొన్ని రోజులుగా సిటీలో చిన్నారుల ఫ్యాషన్ షోలు పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రెగ్యులర్ షోలలో టీజింగ్ పార్ట్‌గానో, సరదా కోసం మాత్రమే పిల్లల డ్రెస్సింగ్ సీక్వెన్స్ పెట్టేవారు.. ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో పిల్లల డ్రెస్సింగ్ కోసమే షోలు నిర్వహిస్తున్నారు. వీటికి పేరెంట్స్ పెద్దసంఖ్యలో హాజరవుతూ తమ పిల్లల కోసం ఎంతో శ్రద్ధగా డిజైన్లను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో చైల్డ్ మోడల్స్ కూడా పెరిగారు.
 
ఇది ప్యూర్లీ వెడ్డింగ్ వేర్. తలపాగా నుంచి షేర్వాని వరకూ...
 
జార్జెట్, వెల్వెట్ కాంబినేషన్‌తో హైలీ డిజైన్డ్ వెస్ట్రన్‌వేర్. ఎంబ్రాయిడరీని సరైన రీతిలో జత చేయడంతో దీనికి మరింత లుక్ వచ్చింది.
 
గ్రే శాటిన్ ఫ్యాబ్రిక్ మీదఎల్లో సిల్క్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్‌తో రూపొందిన ఈ డ్రెస్... రిసార్ట్ వేర్.
 
ఆప్లిక్ వర్క్‌తో ఎల్లో, బ్లాక్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీ కలగలిపి... దీనికి గ్రే బ్యాక్‌గ్రౌండ్ జత చేశారు. జార్జెట్, కాటన్ సిల్క్‌లు గార్మెంట్ డిజైన్‌కి అదనపు సొబగులు అద్దుతున్నాయి.
 
లుక్ అదుర్స్
రా సిల్క్, క్రేప్, నెట్ క్లాత్‌తో చేసిన సాఫా వంటి ఫ్యాబ్రిక్స్‌ను యూజ్ చేశారు. పింక్ బాటమ్‌తో చక్కగా అమరిపోయిన హాఫ్ వైట్ టాప్‌కి.. స్టోన్స్‌కు ఫ్రెంచ్ నాట్స్ ఎంబ్రాయిడరీ జత చేయడంతో పార్టీవేర్ లుక్  మరింతగా డ్రెస్‌పై మెరిసింది.
 
ఇది లేటెస్ట్ ట్రెండ్..
తమ పిల్లల కోసం కూడా డిజైనర్‌లను సంప్రదించడం అనేది సిటీలో లేటెస్ట్ ట్రెండ్ అనే చెప్పాలి. ఇది డిజైనర్‌లకు తమను తాము ఆల్‌రౌండర్లుగా నిరూపించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే... చిల్డ్రన్ డ్రెస్సింగ్‌లో ప్రయోగాలకు బాగా వీలుంటుంది. అందుకే మా స్టూడెంట్స్‌కి తరచూ చిన్నారుల దుస్తుల శైలులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచిస్తుంటాం. పిల్లల ఫ్యాషన్ షోల ద్వారా డిజైనర్ల సత్తాను ప్రదర్శించవచ్చు.
 - క్రితిక, ఇన్‌స్టిట్యూటో డిజైన్ ఇన్నొవేషన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement