‘దళితుడిననే నాపై విమర్శలు’ | Dalits Naney criticism against me' | Sakshi
Sakshi News home page

‘దళితుడిననే నాపై విమర్శలు’

Published Sat, Apr 9 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

Dalits Naney criticism against me'

ఎంపీపీ ఈర్ల సదానందం

 

రేగొండ : ఎంపీపీగా దళితుడిననే ఎంపీటీసీలు విమర్శిస్తున్నారని స్థానిక ఎంపీపీ ఈర్ల సదానందం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతి నిధులను సర్వసభ్య సమావేశంలో వివరించిన అనంతరం ఆమోదం పొందిన వాటికి మాత్రమే నిధులను విడుదల చేసి ప్రతీది రికార్డు ప్రకారమే ప్రజా అవసరాల ప్రకారం ఖర్చు చేశానన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల తీర్మానం మేరకే ఎంపీటీసీలకు నిధులు విధులు అనేవి కల్పించడం జరగుతుందని, కేవలం మండల సభ తీర్మానంతో ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించబడవన్నారు. ఇప్పటికైన కేవలం రాష్ట ప్రభుత్వంతోనే ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులను విధులను కల్పించడం సాధ్యం కాదనే విషయాన్ని ఎంపీటీసీలు గమనించాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement