వ్వెంల(సూర్యాపేట) : ఽఒక్కరోజు ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ధరావతు స్వాతి ఇక లేదు. కొంత కాలంగా ప్రాంక్రియాటిస్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె గురువారం రాత్రి తుదిశ్వాస విడిచింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని జగనాతండాకు చెందిన ధరావతు స్వాతి (23) డిగ్రీ చదువుతూ కేన్సర్ బారినపడింది.
దీంతో ఆమె చిరకాల కోరిక ఎస్‌ఐ కావాలని ఉండటంతో తల్లిదండ్రులు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని కలిశారు. తమ కూతురు కోరికను తీర్చాలని కోరారు. స్పందించిన ఆయన ఒక్కరోజు ఎస్‌ఐగా విధులు నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మేక్ ఏ విష్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆమెను చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఒక్కరోజు ఎస్‌ఐగా విధులు నిర్వహించేలా నియమించారు.
దీంతో ఆమె జూన్ 6వన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్లి మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment