సాలూరు టీడీపీలో లొల్లి!
సాలూరు : సాలూరు మున్సిపాలిటీలో ఆధిక్యం సాధించిన టీడీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠా న్ని కైవసం చేసుకున్నా... వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఇంకా కొలిక్కి రాలేకపోతోంది. మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 17 స్థానాలలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా, 9 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, మిగిలిన మూడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఆ పార్టీ పెద్దలు ఒక నిర్ణయూనికి రాలేకపోతున్నారు. వైస్ చైర్మన్ పదవి కోసం ప్రధానంగా ఇద్దరు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు.
టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతి రావు తన భార్య శ్యామలకు ఆ పదవిని కట్టబెట్టాలని పట్టుబడుతుండగా, వైస్ చైర్మన్ పదవిని తనకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని..ఇచ్చిన మాటను నిలుపుకోవాలని మరో సీనియర్ కౌన్సిలర్ కాకి పాండురంగారావు పట్టుబడుతున్నారు. తన భార్యకు పదవి ఇవ్వకపోతే పార్టీ పట్టణ అధ్యక్ష పదవిని చేపట్టలేనని ఆ పార్టీ నాయకుల ఎదు ట నిమ్మాది స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే పాండు రంగారావు మాత్రం తనకు వైస్ చైర్మన్ ఇవ్వకపోతే పార్టీని వీడేందుకు కూ డా వెనుకాడనని తెగేసి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. దీంతో ఆయన మద్దతుదారులను సమీకరిస్తున్నట్టు భోగట్టా.
కాగా వైస్ చైర్మన్ ఎంపికలో ప్రతిసారీ అనూహ్యంగా మార్పులు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2005లో చైర్‌పర్సన్ గా ముగడ గంగమ్మ ఎన్నిక కాగా వైస్ చైర్మన్‌గా ముందు పువ్వల నాగేశ్వరరావు పేరును ప్రతి పాదించారు. ఆఖరి నిముషంలో గొర్లె మధుసూదనరావు తెరపైకి వచ్చారు. అంతకుముం దు జరజాపు ఈశ్వరరావు పాలకవ ర్గంలో కొల కోటి సూర్యనారాయణను వైస్ చైర్మన్‌గా నిర్ణయిస్తే, అనూహ్యంగా గిరి రఘు పదవి చేపట్టా రు. అంతకన్నా ముందు కేతిరెడ్డి గాయత్రిదేవి పాలకవర్గంలో చూస్తే వైస్ చైర్మన్‌గా జరజాపు సూరిబాబు పేరును నిర్ణయిస్తే పువ్వల నాగేశ్వరరావును ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొన సాగుతోంది.