సాక్షి, నెట్‌వర్క్: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 200 కుటుంబాలు టీడీపీని వీడి మంగళవారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి నుంచి టీడీపీకి చెందిన పలువురు యువత తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. విస్సన్నపేట మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కి చెందిన టీడీపీ మైనార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ టీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో 50 మంది ముస్లీం మైనార్టీ నేతలు, మహిళలు పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బిళ్లు కృష్ణమూర్తి కుమారులైన బిళ్లు బ్రదర్స్‌గా పిలువబడే బిళ్లు నర్సింహరావు, బిళ్లు అన్నవరం, యర్రంశెట్టివారిపాలెం గ్రామం పూతినీడివారిపాలెంలో జనసేన, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యే ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
పాలకొల్లులోని 18వ వార్డు బెత్లహాంపేటలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, యలమంచిలి మండలంలోని అడవిపాలెం పంచాయతీ గగ్గిపర్రుకు చెందిన టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో పార్టీలో చేరారు. భీమవరానికి చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, 100 మందికిపైగా నాయి బ్రాహ్మణులు, చిన ఆమిరం, భీమవరంలోని అప్పారావు తోట, నరసయ్య అగ్రహారం ప్రాంతాలకు చెందిన 50 మంది క్షత్రియులు, భీమవరం 18వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులు వార్డు మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్‌పీలో చేరారు.
ఏలూరు జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీ కోటగిరి శ్రీధర్ సమక్షంలో సీతంపేట జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాలలోని 36వ వార్డు సంజీవనగర్ ఏరియా నుంచి 200 కుటుంబాలు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment