సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై సినీ నటుడు శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ) బుధవారం స్పందించింది. మౌంట్ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్‌లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment