![Sr Nagar: Case Against 2 Youths who allegedly Came Into House Created Chaos - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/17/Crime_0126.jpg.webp?itok=fj59Xti8)
సాక్షి, అమీర్‌పేట: అకారణంగా ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన 18 ఏళ్ల బాలుడు, 20 ఏళ్ల నవీన్ ఇద్దరూ శుక్రవారం ఎస్‌ఆర్‌నగర్‌లోని నర్మదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో చొరబడ్డారు. ఎందుకు వచ్చారని ఆ ఇంట్లో వారు అడుగుతున్నా వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ నానా హంగామా సృష్టించారు.
అడ్డుకోబోయిన యజమాని సత్యనారాయణపై దాడి చేసి చేతిలోని సెల్‌ఫోన్ తీసుకుని ధ్వంసం చేశారు. శబ్దాలు విన్న పొరుగువారు వచ్చి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఆ ఇద్దరు యువకులకు ఓ యువతి వాట్సాప్ కాల్ చేసి తిట్టింది. ఆ యువతి చిరునామా చెప్పాలని మరో యువతిని అడుగగా రూ.3 వేలు ఇస్తే చెబుతాననడంతో డబ్బులు పంపించారు. ఆ యువతి చెప్పిన తప్పుడు చిరునామాకు వచ్చి హంగామా సృష్టించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment