కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. దహెగాం, కాగజ్‌నగర్, సిర్పూర్ (టి), కౌటాల మండలాల లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. తమకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని 19, 22, 23, 25, 26 వార్డులకు చెందిన మహిళలు సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్‌తో వాగ్వాదానికి దిగా రు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షబ్బీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ఇళ్ల స్థలాల పట్టాలిచ్చినా.. ఇప్పటివరకు స్థలం చూపించడం లేద ని అన్నారు. స్థలం ఇచ్చాకే భూపంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పందించిన సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్, మండల అభివృద్ధి శాఖల అధికారులను సర్వే నిర్వహించాలని ఆదేశించామని చెప్పారు.
త్వరలోనే ప్రతి ఒక్కరికీ భూమి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్పష్టమైన తేదీని ప్రకటిస్తేనే కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చూస్తామని షబ్బీర్‌హుస్సేన్, మహిళలు తేల్చిచెప్పారు. రెండు నెలల్లో స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని సబ్‌కలెక్టర్ భరోసా ఇచ్చారు. మరో పక్షం రోజు ల్లోనే ఎన్నికల కోడ్ రానుందని, రెండు నెలల వ్యవధి కాకుం డా త్వరగా భూములు చూపించాలని మహిళలు సబ్‌కలెక్టర్‌ను కోరారు. ఈనెల 25లోగా భూములు అందించేలా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య స్పష్టం చేశారు.
నిరుపేదలకు న్యాయం చేస్తాం..
భూ పంపిణీలో నిరుపేదలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అన్నారు. భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 20 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశామన్నారు. సబ్‌కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ.. భూపంపిణీలో అవకతవకలు జరగకుండా చూస్తామన్నారు. అనంతరం వివిధ గ్రామాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్, సిర్పూర్ (టి), కౌటాల, దహెగాం తహశీల్దార్లు మల్లేశ్, రమేష్‌గౌడ్, రియాజ్‌అలీ, వీఆర్వోలు, సర్పంచులు పాల్గొన్నారు.
భూ పంపిణీలో గందరగోళం
Published Mon, Feb 10 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement