సాక్షి,హైదరాబాద్: నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది.
వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాన్ని ఆపే క్రమంలో జీహెచ్‌ఎంసీ వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
సాధారణంగా హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ చెత్త తీసుకెళ్లే లారీలతో తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓవర్‌స్పీడు, ఓవర్‌లోడులతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగున్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ చెత్త ఊడ్చే వాహనం కూడా అదుపుతప్పి ప్రమాదానికి కారణమవడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ముస్తాబైన మణిహారం
Comments
Please login to add a commentAdd a comment