Mallapur
-
HYD: మల్లాపూర్‌లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం
సాక్షి,హైదరాబాద్: నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది.వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాన్ని ఆపే క్రమంలో జీహెచ్ఎంసీ వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.సాధారణంగా హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ చెత్త తీసుకెళ్లే లారీలతో తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓవర్స్పీడు, ఓవర్లోడులతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ చెత్త ఊడ్చే వాహనం కూడా అదుపుతప్పి ప్రమాదానికి కారణమవడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ముస్తాబైన మణిహారం -
నాచారం మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
-
హైదరాబాద్: మల్లాపూర్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. తాజాగా మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్మేసింది. ఈ క్రమంలో పక్కన ఉన్న హల్దీరామ్ గోదాంకు ఈ మంటలు వ్యాపించాయి. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కాసేపు తర్వాత మంటలు భారీ స్థాయిలో మళ్లీ చెలరేగాయి. దీంతో 11 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 16 కోట్లుంటేనే పసిదానికి ప్రాణం!
మల్లాపూర్: తమకు పండంటి పాప పుట్టిందని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు! ఇందుకు కారణం... ఆ చిన్నారిలో కదలికలు క్రమంగా తగ్గిపోవడమే!! ప్రస్తుతం నాలుగు నెలల వయసున్న ఆ బిడ్డ తల, కాళ్లు, చేతులు ఆడించలేని స్థితికి చేరుకోవడమే!! స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్–1గా పిలిచే అరుదైన జన్యువ్యాధి బారిన ఆ పసిపాప పడటమే!! ఈ వ్యాధి చికిత్సకు రూ. లక్షలు కాదు.. ఏకంగా రూ. కోట్లు కావాలని వైద్యులు చెప్పడంతో రెక్కాడితేకానీ డొక్కాడని ఆ నిరుపేద దంపతులు విలవిల్లాడుతున్నారు. దీనికితోడు కేవలం మరో 3 నెలల్లోనే ఆ సొమ్మును సమకూర్చుకోకుంటే పాప ప్రాణం దక్కదని తెలిసి దాతల సాయం కోసం చూస్తున్నారు. పిడుగులాంటి వార్త... నాచారం బాబానగర్‌కు చెందిన ఫయాజ్, రేష్మకు 2019లో వివాహం జరిగింది. ఫయాజ్ ఓ మొబైల్ షాప్‌లో పనిచేస్తుండగా ఆయన భార్య గృహిణి. వారికి 2021 ఆగస్టు 31న కుమార్తె ఫైజా జన్మించింది. తమ బిడ్డ కాళ్లు, చేతులు అడించట్లేదని గుర్తించిన తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చూపించారు. నెలపాటు చిక్సిత అందించినా చిన్నారి కోలుకోకపోవడంతో ఆమె జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానించి ఆమె రక్త నమూనాలను నిమ్స్‌కు పంపించారు. నిమ్స్ వైద్యులు శాంపిళ్లను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)కి పంపగా ఆ చిన్నారి ఎస్ఎంఏ టైప్–1 జన్యు వ్యాధితో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వ్యాధిని నయం చేయడానికి విదేశాల నుంచి రూ. 10 కోట్ల ఖరీదైన ఇంజక్షన్తోపాటు దిగుమతి పన్నులు కలిపి రూ.6 కోట్లు కలిపి మొత్తం రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. మంత్రి హరీశ్‌కు తల్లిదండ్రుల మొర... ఫయాజ్, రేష్మలు మంగళవారం వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి నివేదికలను చూపారు. దీంతో స్పందించిన ఆయన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇంజక్షన్ కోసం ప్రయత్నిద్దామని హామీ ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాతలు ఆర్థిక సాయం పంపాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు అకౌంట్ పేరు: ఫైజా అకౌంట్ నంబర్: 90928679014210 ఐఎఫ్ఎస్సీ కోడ్: IDFB0020101 యూపీఐ ట్రాన్స్‌శాక్షన్ కోసం: assist.faiza@icici -
మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్
సాక్షి, మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్‌పై గత రెండు రోజులక్రితం దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో క్రాస్ జెండర్ మసాజ్ సెంటర్‌పై నాచారం పోలీసులు దాడి చేశారు. సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన మేరకు.. నాచారం హెచ్ఎంటీనగర్ ప్రధాన రహదారిలో బాలానీనగర్ జవహర్‌నగర్‌కు చెందిన రజిత అలియాస్ సుప్రియ స్పైసీ హెయిర్ బ్యూటీపార్లర్ సెంటర్లో క్రాస్ జెండర్ మసాజ్ నడుపుతున్నారు. చదవండి: విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి.. గురువారం రాత్రి పోలీసులు మసాజ్ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకులు ఎం.రజిత (37), ఆమె భర్త నాగేందర్ (39), బోడుప్పల్ హేమానగర్‌కు చెందిన సహాయకుడు కె.శివ (34), వీరితో పాటు మసాజ్ సెంటర్లో పని చేస్తున్న ముగ్గురు మహిళలు, కస్టమర్ బండి బాలకృష్ణను (34) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు, ఫోన్ పే స్కానర్, ఎంటీఎం కార్డు, స్వైప్ మీషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకోని రిమాండ్‌కు తరలించిన్నట్లు సిఐ తెలిపారు. -
వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘర్షణ
-
కరోనా: పెళ్లి రోజు నాడే ప్రాణాలు విడిచిన పాండు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎంతోమందిని బలితీసుకుంటూ తమ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. తాజాగా పెళ్లిరోజు నాడే ఇంటి పెద్దను పాడె ఎక్కించి కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది. మల్లాపూర్‌లోని నాగలక్ష్మీ కాలనీలో నివాసముంటున్న పాండు.. ఇసుక కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. లక్షణాలు కనిపించకపోవడంతో టెస్ట్ చేసుకోవడంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోం క్వారంటైన్లో ఉంటూ మందులు తీసుకున్నాడు. అయిదు రోజులపాటు హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక రోజుల ముఖం అంతా నల్లగా అవ్వడంతో అనుమానం వచ్చిన తల్లి ఏమైందిరా అని అడిగింది. దీంతో ఆయాసం, గుండెలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు. తనకేం కాదని ఆ తల్లి కూడా కొడుక్కి దైర్యం చెప్పింది. మరోవైపు ట్రీట్మెంట్కు ఇబ్బంది కాకుండా డబ్బులు కూడా సమకూర్చుకున్నారు. అప్పు చేసి వైద్యం కోసం మొత్తం రూ. 10-12 లక్షలు ఖర్చు చేసుకున్నారు. ఆసుపత్రిలో చూపించుకున్న పాండు ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వలేదు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అదే సమయంలో ఆక్సిజన్ కొరత కూడ ఉండటంతో పరిస్తితి మరింత విషమించింది. దీంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనకేం కాదని పెళ్లి రోజు నాటికి ఇంట్లో ఉంటానని పాండు మాటిచ్చాడు. కానీ జరిగింది వేరు. అంతలోనే విషాదం అలుముకుంది. పెళ్లిరోజే పాండు కోవిడ్‌తో మరణించాడు. అతని మరణంతో కుటుంబం అంతా రోడ్డున పడింది. ఇంటి పెద్ద పెళ్లి రోజే పాడే ఎక్కించి కుంటుంబానికి దిక్కులేకుండా చేసింది మాయదారి కరోనా.. మూడు తరాల మనుషులతో కళకళలాడే ఇంటిని కూల్చేసింది. చదవండి: హృదయ విదారకం: ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ.. -
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ లో అగ్నిప్రమాదం
-
ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం
నాచారం : హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఇంక్ తయారు చేసే ఓ కంపెనీలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం
-
దేవాలయంలో పంచలోహ విగ్రహాలు చోరీ
హైదరాబాద్: నగర శివారు ప్రాంతం నాచారం మల్లాపూర్‌లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. శనివారం అర్థరాత్రి దేవాలయంలోని దొంగలు ప్రవేశించి... మూడు పంచలోహ విగ్రహాలతోపాటు వెండి కిరీటం, అమ్మవారి నగలు అపహరించారు. దేవాలయంలో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు దేవాలయానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. -
మల్లాపూర్‌లో షర్మిల పరామర్శ యాత్ర
-
చెరుకు రైతుల ఆందోళన
మల్లాపూర్, న్యూస్‌లైన్ : ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెరుకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లిలో జాతీయ రహదారి దిగ్బంధించిన రైతులకు మద్దతుగా మల్లాపూర్‌లో రైతులు ధర్నా చేపట్టారు. కషింగ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా.. రూ.24కోట్ల బకాయిలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. సీడీసీ చైర్మన్ అల్లూరి ఆదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గంగారాజం, మల్లారెడ్డి, సుంకేటి నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, లింబారెడ్డి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.