ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెరుకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లిలో జాతీయ రహదారి దిగ్బంధించిన రైతులకు మద్దతుగా మల్లాపూర్‌లో రైతులు ధర్నా చేపట్టారు.
మల్లాపూర్, న్యూస్‌లైన్ : ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెరుకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లిలో జాతీయ రహదారి దిగ్బంధించిన రైతులకు మద్దతుగా మల్లాపూర్‌లో రైతులు ధర్నా చేపట్టారు.
కషింగ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా.. రూ.24కోట్ల బకాయిలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. సీడీసీ చైర్మన్ అల్లూరి ఆదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గంగారాజం, మల్లారెడ్డి, సుంకేటి నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, లింబారెడ్డి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.