హైదరాబాద్: నగర శివారు ప్రాంతం నాచారం మల్లాపూర్లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. శనివారం అర్థరాత్రి దేవాలయంలోని దొంగలు ప్రవేశించి... మూడు పంచలోహ విగ్రహాలతోపాటు వెండి కిరీటం, అమ్మవారి నగలు అపహరించారు. దేవాలయంలో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు దేవాలయానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.