హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో గందరగోళం ఏర్పడింది. మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రులతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా సమావేశానికి హాజరయ్యారు. రాంరెడ్డి దామోదరరెడ్డి, పొన్నం ప్రభాకర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దాంతో రేణుకాచౌదరి కొందరు విద్యార్థులను వెంటేసుకొచ్చారు. వారు తమ నేతను సమావేశానికి ఎందుకు రానివ్వరని అడిగారు. ఆమెకు అనుకూలంగా విద్యార్థులు నినాదాలు చేశారు.