ముండేను పవార్ వారించారు!
ముండేను పవార్ వారించారు!
Published Tue, Jun 10 2014 4:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన దివంగత కేంద్రమంత్రి గోపినాథ్ ముండేను మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ వారించారని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ మీడియాకు వెల్లడించారు.
బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందనే భావనలో ఉన్న ముండే.. తన డిమాండ్లను బీజేపీ అంగీకరించకపోతే.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఓ దశలో నిర్ణయించుకున్నారని రావత్ అన్నారు.
బీజేపీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తితో పవార్ ను ముండే కలిశారని..అయితే బీజేపీని వీడవద్దని పవార్ హెచ్చరించారని శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఉత్సవ్ అనే అనుబంధంలో కథనాన్ని ప్రచురించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్న నేతగా బీజేపీ నేతగా ముండేకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.
రాజకీయాలకు అతీతంగా నేతలతో ముండేకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆ చోరవతోనే పవార్ ను ముండే కలిసినట్టు కథనంలో పేర్కొన్నారు. కారు ప్రమాదంలో మరణించిన ముండేకు శాసన మండలిలో నివాళులర్పిస్తూ బీజేపీ ఎమ్మెల్సీ పాండురంగ పుంద్కర్ .. ముండే జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనల్ని నెమరు వేసుకున్నారు.
Advertisement
Advertisement