
కేంద్రమంత్రి గోపినాథ్ ముండేకి తీవ్ర గాయాలు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. గోపినాథ్ ప్రయాణిస్తున్న వాహనం కాన్వాయి అదుపు తప్పడంతో ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ ప్రమాద ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో గోపినాథ్ ముండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 16వ లోక్సభకు గోపినాథ్ ముండే ఎన్నికయ్యారు.