ఘోర ప్రమాదం : ముగ్గురు ఎయిమ్స్ వైద్యులు దుర్మరణం | Road Accident in Delhi Three doctors killed | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం : ముగ్గురు ఎయిమ్స్ వైద్యులు దుర్మరణం

Published Sun, Mar 18 2018 10:46 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Road Accident in Delhi Three doctors  killed - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎయిమ్స్  వైద్యులు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఒక కంటైనర్‌లోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

సమాచారం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ యష్‌పాల్, డాక్టర్ హర్షద్, డాక్టర్ హేంబాల అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.  డాక్టర్ హర్షద్ పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగనట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement