గుండెపోటుతో కాదు గాయాల వల్లే ముండే మృతి
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతికి గల కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముండే తీవ్రంగా గాయపడటంతో పాటు గుండెపోటు రావడంతో చనిపోయారని ఎయిమ్స్ వైద్యులు తొలుత ప్రకటించారు. అయితే ముండేకు గుండెపోటు రాలేదని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. పోస్ట్మార్టం నివేదికను బుధవారం విడుదల చేశారు.
ముండే శరీరంలోపలి భాగాలకు గాయాలయినట్టు తేలింది. కీలకమైన భాగాలు దెబ్బతిన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించిన సంగతి తెలిసిందే. బుదవారం ముండే స్వరాష్ట్రం మహారాష్ట్రలో అంత్యక్రియలు నిర్వహించారు.