'నాన్న మద్దతుదారులు సీఎం కావాలని కోరుకుంటున్నారు' | People who wanted see as Chief Minister: Pankaja Munde | Sakshi
Sakshi News home page

'నాన్న మద్దతుదారులు సీఎం కావాలని కోరుకుంటున్నారు'

Published Fri, Oct 17 2014 7:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'నాన్న మద్దతుదారులు సీఎం కావాలని కోరుకుంటున్నారు' - Sakshi

'నాన్న మద్దతుదారులు సీఎం కావాలని కోరుకుంటున్నారు'

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి పదవి రేసులో ఉంటానని దివంగత నేత గోపినాథ్ కూతురు పంకజ ముండే సిగ్నల్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తన తండ్రి మద్దతు దారులు, యువత కోరుకుంటున్నారని  పంకజ ముండే తెలిపారు. 
 
వారసత్వం తనకు అడ్డంకి కాదు. నా తండ్రి మరణం తర్వాత కేంద్రమంత్రి పదవి చేపట్టాలని పార్టీలో చర్చించారు. అయితే నేను కేంద్రమంత్రి పదవిని తీసుకోలేదు అని అన్నారు. వారసత్వ రాజకీయాలకు ప్రధాని నరేంద్రమోడీ వ్యతిరేకమనే ప్రశ్నకు వారసత్వం అనేది ప్రధానాంశం కాదు, నా అర్హతకే మోడీ ప్రాధాన్యత ఇస్తారని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement