ముండే భార్యకు సంతాపం తెలిపిన సోనియా | Sonia gandhi writes to Gopinath Munde's wife | Sakshi
Sakshi News home page

ముండే భార్యకు సంతాపం తెలిపిన సోనియా

Published Tue, Jun 3 2014 5:35 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Sonia gandhi writes to Gopinath Munde's wife

న్యూఢిల్లీ:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే భార్య ప్రదణ్యకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆమె.. ముండే కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. ఆయన ప్రమాదంలో మరణించడం కుటుంబానికి  తీర్చలేని మనోవేదనను మిగిల్చిందన్నారు. ఆయన ఆకస్మిక మరణం వెనుకబడిన వర్గాలకు కూడా తీరని లోటేనని సోనియా పేర్కొన్నారు.

 

ప్రజా జీవితంతో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించిన ముండే మరణం చాలా దురదృష్టకరమని తెలిపారు. దేశ ప్రజలకు ముండే జీవితం ఒక ఆదర్శప్రాయంగా నిలిచిపోతుందని సోనియా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ కార్యాలయంలో ముండే భౌతికకాయాన్నిరాహుల్ గాంధీ సందర్శించి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement