
సాక్షి, లక్నో : యూపీ బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సీతాపూర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్‌ను ఢీకొనడంతో ఎమ్మల్యేతో పాటు ఆయన సెక్యూరిటీ గార్డులు ఇద్దరు మరణించారు. ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కూడా మరణించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే, గన్‌మెన్ల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
బిజ్నూర్ జిల్లా నూర్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన యూపీ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.2012లో నూర్పూర్ నుంచి గెలుపొందిన సింగ్ 2017లో తిరిగి అదే స్ధానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.