పింప్రి, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ నేత గోపీనాథ్‌ముండే కుమార్తె పంకజ్ పాలవే తమ తండ్రుల ప్రతిష్టను మరింత పెంచేందుకు వివిధ ప్రాంతాల్లో పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నారు.
బుధవారం సుప్రియాసూలే బీడ్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొని ప్రచారం నిర్వహించగా, పంకజ్ పాలవే బారామతిలో ప్రచారం చేశారు. సుప్రియా గ్రామగ్రామాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. గోపీనాథ్ ముండేను ఓడించి జిల్లా రాజకీయాల నుంచి దూరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు గోపినాథ్ ముండే పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉండడంతో తన ప్రచార బాధ్యతలను కుమార్తె పంకజ్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆమె బారామతిలో మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న‘రాష్ట్రీయ సమాజ్ పక్ష్’ అభ్యర్థి మహాదేవ్ జానకర్ గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు.
బారామతిలో శరద్ పవార్ రాజకీయాలకు ముగింపు ఇవ్వండని పిలుపునిస్తున్నారు. ఇదిలా వుండగా బీడ్ జిల్లాలో శరద్‌పవార్, అజిత్ పవార్ ప్రచారం ఒక దశ పూర్తి అవ్వగా, బీజేపీ నేత గోపీనాథ్ ముండే బారామతిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ వివరాలను త్వరలోనే తెలుపనున్నామని సంబంధిత నాయకుడొకరు తెలిపారు.
తండ్రుల కోసం తనయల పోటాపోటీ ప్రచారం
Published Thu, Mar 20 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement