Baramati battle
-
మరో సంచలనం : అజిత్ పవార్‌పై శరద్ పవార్ మనవడు పోటీ
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతిలో నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పోటీ చేస్తుండగా..ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్‌ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ) పోటీచేస్తున్న 45 మంది అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ 45 మంది అభ్యర్థుల జాబితాలో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 32ఏళ్ల యుగేంద్ర పవార్ పేరు సైతం ఉంది. పవార్ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది. Pune | On Baramati candidate selection, Maharashtra State President of the NCP (Sharadchandra Pawar faction), Jayant Patil says, "Baramati candidate selection is based on the demand from the local people of Baramati...I had the interaction with them...They have suggested he is… pic.twitter.com/Fi2mClnFrr— ANI (@ANI) October 24, 2024లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య సునేత్ర పవార్‌ను బరిలోకి దింపగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేశారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని పలుమార్లు మీడియా ఎదుట వెల్లడించారు. ఇప్పుడు తాజా అజిత్ పవార్‌పై తన మనవడు శరద్‌పవార్‌ను పోటీకి దించడం సంచలనంగా మారింది. -
వదిన-మరదళ్ల సమరం : ‘బారామతి నేను.. నేను బారామతి’ని
ముంబై : మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో నిలిచారు. వారిలో సుప్రియా సూలే తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న శరద్ పవర్ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంటే.. భార్య సునేత్ర పవార్ తరుపున అజిత్ పవార్ ప్రచారంతో ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ ఈ తరుణంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదని చెప్పారు. అంతేకాదు తాను బారామతిలో పుట్టి పెరిగానని, దాని మట్టితో కనెక్ట్ అయ్యానని అన్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ అని పేర్కొన్నారు. శరద్ పవార్ అంతం కోసం ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్ని ‘ప్రతీకార పోరాటం’గా మార్చారంటూ సుప్రియా సూలే మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌పై మండిపడ్డారు. పాటిల్ గత వారం బారామతికి వచ్చి ఈ యుద్ధం శరద్ పవార్‌ను అంతం చేయడం కోసమే అని వ్యాఖ్యానించారు. అభివృద్ది గురించి మాట్లాడితే ప్రజలు ఇష్టపడతారు. ఇలా మాట్లాడితే ఎలా? ఈ తరహా వ్యాఖ్యలతో పాటిల్ వ్యక్తిగత ఎన్నికలుగా మార్చారని చెప్పుకొచ్చారు. బారామతి మట్టికి రుణపడి ఉంటాం. 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి సీటుతో తనకు ఉన్న అనుబంధం గురించి అడిగిన ప్రశ్నకు సులే మాట్లాడుతూ.. ‘బారామతి నేను, నేను బారామతిని.నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ రోజు నేను, నా కుటుంబం అంతా బారామతి మట్టికి రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు. నా అనుకున్న వాళ్లు దూరమైతే అజిత్ పవార్ అభ్యర్ధిగా బరిలో దిగడంపై.. మన అనుకున్నవాళ్లు దూరమైనప్పుడు బాధగానే ఉంటుంది. నాక్కూడా అలాగే ఉంది. నేను బంధాలు, వ్యక్తులకు విలువ ఇస్తాను. కానీ నేను చేస్తున్న ఈ రాజకీయాలు మాత్రం కుటుంబం కోసం ప్రజలకు సేవ చేయడం కోసమేనంటూ ఎన్నికల ప్రచారంలో వడివడిగా అడుగులు ముందుకు వేశారు. -
తండ్రుల కోసం తనయల పోటాపోటీ ప్రచారం
పింప్రి, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ నేత గోపీనాథ్‌ముండే కుమార్తె పంకజ్ పాలవే తమ తండ్రుల ప్రతిష్టను మరింత పెంచేందుకు వివిధ ప్రాంతాల్లో పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం సుప్రియాసూలే బీడ్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొని ప్రచారం నిర్వహించగా, పంకజ్ పాలవే బారామతిలో ప్రచారం చేశారు. సుప్రియా గ్రామగ్రామాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. గోపీనాథ్ ముండేను ఓడించి జిల్లా రాజకీయాల నుంచి దూరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు గోపినాథ్ ముండే పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉండడంతో తన ప్రచార బాధ్యతలను కుమార్తె పంకజ్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆమె బారామతిలో మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న‘రాష్ట్రీయ సమాజ్ పక్ష్’ అభ్యర్థి మహాదేవ్ జానకర్ గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. బారామతిలో శరద్ పవార్ రాజకీయాలకు ముగింపు ఇవ్వండని పిలుపునిస్తున్నారు. ఇదిలా వుండగా బీడ్ జిల్లాలో శరద్‌పవార్, అజిత్ పవార్ ప్రచారం ఒక దశ పూర్తి అవ్వగా, బీజేపీ నేత గోపీనాథ్ ముండే బారామతిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ వివరాలను త్వరలోనే తెలుపనున్నామని సంబంధిత నాయకుడొకరు తెలిపారు.